News February 16, 2025
జుక్కల్: బావిలో దూకి వ్యక్తి ఆత్మహత్య

జుక్కల్ మండల కేంద్రానికి చెందిన బిజ్జవార్ చంద్రమోహన్ ఇవాళ ఉదయం పాడుబడ్డ బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్నట్లు స్థానికులు పేర్కొన్నారు. కుటుంబీకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు ఎస్ఐ భువనేశ్వర్ తెలిపారు. మృత దేహాన్ని పంచనామా నిర్వహించి పోస్టుమార్టం నిమిత్తం బాన్సువాడ ఏరియా ఆస్పత్రికి పంపించినట్లు వివరించారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.
Similar News
News November 18, 2025
బనకచర్ల పేరు మార్చి అనుమతులకు ఏపీ యత్నం: ఉత్తమ్

SC స్టే ఉన్నా ఆల్మట్టి ఎత్తు పెంచేందుకు కర్ణాటక ప్రయత్నిస్తోందని TG మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. ఎత్తు పెంచొద్దని కోర్టు చెప్పిందన్నారు. కేంద్ర మంత్రి CR పాటిల్‌తో భేటీ అనంతరం ఆయన మాట్లాడారు. ‘పోలవరం-బనకచర్లను వ్యతిరేకించాం. పేరు మార్చి AP అనుమతులకు యత్నిస్తోంది. దీనిపై కేంద్రానికి ఫిర్యాదు చేశాం. ప్రాణహిత-చేవెళ్ల, పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టులకు నిధులు కోరాం’ అని మంత్రి వివరించారు.
News November 18, 2025
అనకాపల్లి: ‘రోజుకు 30-40 సదరం స్లాట్స్’

అనకాపల్లి ఎన్టీఆర్ ఆసుపత్రిలో నిర్వహిస్తున్న సదరన్ క్యాంపు ఏర్పాట్లను ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ మంగళవారం పరిశీలించారు. ఈ క్యాంపునకు వచ్చిన దివ్యాంగులతో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పింఛన్ల అర్హత ధ్రువీకరణ పత్రం కోసం దరఖాస్తు చేసుకున్న దివ్యాంగులకు రోజుకు 30-40 స్లాట్స్ ఇవ్వడం జరుగుతుందన్నారు. అనంతరం ఆసుపత్రిలో వివిధ విభాగాలను పరిశీలించారు. దీనిని ఆధునీకరించాల్సి ఉందన్నారు.
News November 18, 2025
వాట్సాప్ ఛానెల్ ద్వారా ‘జైషే’ ఉగ్ర ప్రచారం

ఉగ్ర సంస్థ జైషే మహ్మద్ డిజిటల్ నెట్వర్క్ ద్వారా యువతను టెర్రరిజమ్ వైపు మళ్లిస్తోంది. ఈ సంస్థకు సంబంధించిన వాట్సాప్ ఛానెల్‌ను నిఘా సంస్థలు గుర్తించాయి. ఈ ఛానెల్‌కు 13వేల మంది ఫాలోవర్స్ ఉన్నారు. దీని ద్వారా వేలాది మందిని ఉగ్రమూకలుగా JeM మారుస్తోంది. కాగా ఢిల్లీ పేలుళ్ల కేసులో అరెస్టు చేసిన డానిష్‌ను పోలీసులు పటియాలా హౌస్ కోర్టులో హాజరుపరిచారు. అతడిని 10 రోజుల పాటు ఎన్ఐఏ కస్టడీకి అప్పగించింది.


