News March 17, 2025

జుక్కల్: హోలీ ఆడి, స్నానానికి వెళ్లి శవమై తేలాడు

image

జుక్కల్ మండలంలోని పెద్ద గుల్ల గ్రామానికి చెందిన ప్రకాష్ దేవాడ అనే యువకుడు చెరువులో పడి మృతి చెందినట్లు జుక్కల్ ఎస్ఐ భువనేశ్వర్ తెలిపారు. ఈ నెల 14న హోళీ ఆడి తన తోటి మిత్రులతో దేశ్ముక్ చెరువులో స్నానానికి వెళ్లి బురదలో ఇరుక్కుని ఈ నెల 16న శవమై తేలినట్లు తల్లి చందాబాయి ఫిర్యాదు చేసిందని అన్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ చెప్పారు.

Similar News

News November 19, 2025

అన్నదాతకు ప్రభుత్వం అండ: కలెక్టర్

image

అన్నదాత సుఖీభవ-పీఎం కిసాన్ 2025-26 2వ విడత కింద జిల్లాలో 2,72,757 మంది రైతులకు రూ.181.51 కోట్లు జమయ్యాయని కలెక్టర్ డా. ఏ.సిరి తెలిపారు. కోడుమూరు ఆర్.కొంతలపాడులో జరిగిన కార్యక్రమంలో కలెక్టర్, ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి పాల్గొన్నారు. ఉల్లి, మిర్చి, పత్తి పంటల సమస్యలపై ప్రభుత్వం వెంటనే స్పందిస్తోందని కలెక్టర్ తెలిపారు. జిల్లాలో 11 పత్తి మిల్లులు పనిచేస్తున్నాయన్నారు.

News November 19, 2025

రిస్క్‌లో 350 కోట్లమంది వాట్సాప్ కాంటాక్ట్స్?

image

డేటా లీకేజీతో వాట్సాప్ వినియోగదారుల ప్రైవసీ ప్రమాదంలో పడనున్నట్లు వియన్నా యూనివర్సిటీ హెచ్చరించింది. ఆ యూనివర్సిటీ రీసెర్చర్స్ వాట్సాప్‌లో భారీ భద్రతా లోపాన్ని గుర్తించారు. వరల్డ్ వైడ్‌గా ఉన్న 350 కోట్లమంది యూజర్ల కాంటాక్ట్స్ లీక్ అయ్యే ప్రమాదం ఉన్నట్లు వార్నింగ్ ఇచ్చారు. హ్యాకర్లు లేదా వేరే వ్యక్తులు ఈ కాంటాక్ట్ నంబర్లను చోరీ చేసే అవకాశమున్నట్లు తెలిపారు.

News November 19, 2025

MNCL: ప్రతి మహిళకు చీరలు అందేలా చూడాలి

image

ఇందిరా గాంధీ జయంతిని పురస్కరించుకొని రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న ఇందిరమ్మ చీరలు ప్రతి మహిళకు అందేలా చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. బుధవారం హైదరాబాద్‌లోని రాష్ట్ర సచివాలయం నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రభుత్వం మహిళలు ఆర్థిక స్వావలంబన పొందేందుకు కృషి చేస్తోందన్నారు.