News March 17, 2025
జుక్కల్: హోలీ ఆడి, స్నానానికి వెళ్లి శవమై తేలాడు

జుక్కల్ మండలంలోని పెద్ద గుల్ల గ్రామానికి చెందిన ప్రకాష్ దేవాడ అనే యువకుడు చెరువులో పడి మృతి చెందినట్లు జుక్కల్ ఎస్ఐ భువనేశ్వర్ తెలిపారు. ఈ నెల 14న హోళీ ఆడి తన తోటి మిత్రులతో దేశ్ముక్ చెరువులో స్నానానికి వెళ్లి బురదలో ఇరుక్కుని ఈ నెల 16న శవమై తేలినట్లు తల్లి చందాబాయి ఫిర్యాదు చేసిందని అన్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ చెప్పారు.
Similar News
News December 16, 2025
పోలీసుల అదుపులో 15 మంది మావోయిస్టులు

TG: కొమురం భీమ్(D) సిర్పూర్లో 15 మంది మావోయిస్టులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ముందస్తు సమాచారంతో వారు తలదాచుకున్న ఇంటిని పోలీసులు చుట్టుముట్టారు. లొంగిపోయేందుకే వారంతా ఛత్తీస్గఢ్ నుంచి ఇక్కడికి వచ్చినట్లు సమాచారం. మావోయిస్టుల ఏరివేతకు కేంద్రం ‘ఆపరేషన్ కగార్’ కొనసాగిస్తున్న నేపథ్యంలో ఇటీవల వివిధ రాష్ట్రాల్లో పలువురు మావోయిస్టు నేతలు లొంగిపోయిన సంగతి తెలిసిందే.
News December 16, 2025
కేంద్రం సహకారంతో సజావుగా ఎరువుల పంపిణీ: ఎంపీ చిన్ని

రూ.31 వేల కోట్ల సబ్సిడీతో రైతులకు భరోసా కల్పించి, ఆంధ్రప్రదేశ్లో యూరియా సంక్షోభాన్ని అధిగమించడానికి కేంద్రం సహకరించిందని ఎంపీ కేశినేని చిన్ని మంగళవారం తెలిపారు. కేంద్రం తీసుకున్న చర్యలతో రైతులకు ఎరువుల సరఫరా సజావుగా కొనసాగుతుందని ఆయన పేర్కొన్నారు. భవిష్యత్తులోనూ ఇదే సహకారం కొనసాగించాలని కోరారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఎంపీ కృతజ్ఞతలు తెలిపారు.
News December 16, 2025
పది పరీక్షల్లో జిల్లాను అగ్రగామిగా నిలపాలి: DEO

గుంటూరు జిల్లాను రానున్న 10వ తరగతి పరీక్షల్లో రాష్ట్రంలో అగ్రగామిగా నిలపాలని జిల్లా విద్యాశాఖ అధికారి సలీమ్ బాషా సూచించారు. గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలోని PPD, SJR మున్సిపల్ కార్పొరేషన్ హైస్కూల్స్ని మంగళవారం DEO పరిశీలించారు. 10వ తరగతి స్లిప్ టెస్ట్ పరీక్షా పత్రాలను పరీక్షించారు. ప్రతి పాఠశాలలో 100 రోజుల ప్రణాళికలు అమలవ్వాలని ఆదేశించారు. ఆయన వెంట మండల విద్యాశాఖాధికారి అబ్దుల్ ఖుద్దూస్ ఉన్నారు.


