News June 22, 2024

జులైలోనే రుణమాఫీ: మంత్రి కోమటిరెడ్డి

image

ఇచ్చిన మాటకు కట్టుబడి జులైలోనే రైతులకు రెండు లక్షల రుణమాఫీ చేస్తామని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. నల్గొండ జిల్లా పరిషత్ సమావేశంలో పాల్గొన్న సందర్భంగా ఆయన మాట్లాడారు. రైతు సంక్షేమమే తమ ప్రభుత్వ ధ్యేయమని పేర్కొన్నారు. రైతు భరోసాపై ఇప్పటికే సీఎం ఆధ్వర్యంలో మంత్రులతో కమిటీ వేశామన్నారు.

Similar News

News December 8, 2025

కేతేపల్లి: మూడుసార్లు సస్పెండ్.. సతీమణికి సర్పంచ్ టికెట్

image

కేతేపల్లి మండలం చెర్కుపల్లి గ్రామానికి చెందిన చిన్నబొస్క ప్రసాద్ గతంలో పలు కారణాలపై మూడుసార్లు (మొత్తం 18 నెలలు) సర్పంచ్‌ పదవి నుంచి సస్పెండ్‌ అయ్యారు. గ్రామ సభలు పెట్టలేదని, ముగ్గురు పిల్లలు ఉన్నారని, ఉప సర్పంచ్‌ సంతకం ఫోర్జరీ చేశారని ఆయనపై చర్యలు తీసుకున్నారు. ఈసారి జనరల్ మహిళకు రిజర్వేషన్ రావడంతో, ప్రసాద్ సతీమణి చిన్నబొస్క శైలజ సర్పంచ్ ఎన్నికల బరిలో నిలిచారు.

News December 8, 2025

NLG: మాటల తూటాలు.. స్నేహ బంధాలు!

image

జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికల్లో గెలుపే ధ్యేయంగా ఆయా పార్టీలు వైరం మరిచి ఒకరికొకరు సహకరించుకుంటున్నాయి. చాలా చోట్ల బీఆర్ఎస్, కాంగ్రెస్ కలిసి పోటీ చేస్తుండగా.. మరికొన్ని చోట్ల సీపీఎం, బీజేపీ, ఇంకొన్ని చోట్ల బీజేపీ, కాంగ్రెస్ పొత్తు పెట్టుకున్నాయి. నిన్నటి వరకు ఒకరిపై ఒకరు మాటల తూటాలు పేల్చిన నేతలు ఇప్పుడు స్నేహబంధం చాటుతూ.. కలిసి ఓట్లు అడుగుతుండటంతో ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారు.

News December 8, 2025

కట్టంగూరు: బాండ్‌ పేపర్‌పై హామీ.. నెరవేర్చకుంటే రిజైన్‌..!

image

తాను ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే సర్పంచ్‌ పదవికి రాజీనామా చేస్తానని అభ్యర్థిని శ్రీపాద పుష్పలత సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు రూ.100 బాండ్‌ పేపర్‌పై ఆమె హామీలను లిఖితపూర్వకంగా రాసి ఇచ్చారు. తనను గెలిపిస్తే గ్రామంలో మరో అండర్‌పాస్‌ నిర్మాణం కోసం పోరాడతానని, రెండేళ్లలో అండర్‌పాస్‌ సాధించని పక్షంలో రాజీనామా చేస్తానని ప్రజల సమక్షంలో ప్రకటించారు.