News June 30, 2024
జులై 4న దేశవ్యాప్తంగా విద్యాసంస్థల బంద్: SFI

జులై 4వ తేదీన దేశవ్యాప్తంగా అన్ని విద్యాసంస్థలు మూతపడనున్నాయి. నీట్ పరీక్ష పేపర్ లీకేజీకి బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, ఎన్టీఏను రద్దు చేయాలని ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేస్తూ.. దేశవ్యాప్త బంద్కు పిలుపునిచ్చింది. వీటితో పాటు సెంట్రల్ యూనివర్సిటీలలో విద్యార్థి సంఘ నాయకులపై పెట్టిన అక్రమ కేసులు ఎత్తివేయాలని, స్కూల్స్ మూసివేతను ఆపాలని, ఇతర సమస్యలు పరిష్కరించాలని బంద్ నిర్వహిస్తున్నామని తెలిపారు.
Similar News
News November 19, 2025
గరుడ కమాండ్ కంట్రోల్ కేంద్రాన్ని పరిశీలించిన ఎస్పీ

వెలగపూడి సచివాలయంలోని గరుడ కమాండ్ కంట్రోల్ కేంద్రాన్ని ఎస్పీ వకుల్ జిందల్ బుధవారం పరిశీలించారు. వీవీఐపీ బందోబస్తు, ట్రాఫిక్ పర్యవేక్షణలో కేంద్రం కీలకమని పేర్కొంటూ పనిచేయని కెమెరాలను వెంటనే పునరుద్ధరించాలని, డ్రోన్ గస్తీని కట్టుదిట్టం చేయాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు. సీడ్ యాక్సెస్ రోడ్డు-కరకట్ట మార్గాల్లో రాకపోకలకు అంతరాయం లేకుండా నిరంతర పర్యవేక్షణ చేయాలని సూచించారు.
News November 19, 2025
GNT: 26న జెడ్పీ స్థాయి సంఘ సమావేశం

జిల్లా పరిషత్ 6వ స్థాయి సంఘ సమావేశాన్ని ఈ నెల 26న నిర్వహిస్తున్నట్లు జెడ్పీ ముఖ్య కార్య నిర్వహణాధికారి వి. జ్యోతిబాసు తెలిపారు. ఉదయం 10:30 నుంచి ముఖ్య కార్యనిర్వహణ అధికారి ఛాంబర్లో జిల్లా పరిషత్ వైస్ ఛైర్పర్సన్ అనురాధ అధ్యక్షతన స్థాయి సంఘ సమావేశం జరుగుతుందన్నారు. సాంఘిక, గిరిజన, బీసీ, మైనార్టీ సంక్షేమ శాఖలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కార్పొరేషన్లు, తదితర అంశాలపై సమీక్ష జరుగుతుందన్నారు.
News November 19, 2025
వెంకటపాలెం: సమన్వయ కమిటీ సమావేశంలో పాల్గొన్న కలెక్టర్, ఎస్పీ

తుళ్లూరు మండలం వెంకటపాలెంలోని తిరుమల తిరుపతి దేవస్థానంలో ఈ నెల 27వ తేదీన రెండవ ప్రాకారం నిర్మాణానికి సీఎం చంద్రబాబు హాజరవుతున్న విషయం తెలిసిందే. కలెక్టర్ తమీమ్ అన్సారీయా, ఎస్పీ వకుల్ జిందాల్ ఆధ్వర్యంలో బుధవారం ఉన్నతాధికారుల సమన్వయ కమిటీ సమావేశం జరిగింది. ప్రశాంత వాతావరణంలో కార్యక్రమం జరిగేలా అన్ని ప్రభుత్వ శాఖల సమన్వయంతో చర్యలు చేపట్టాలని కలెక్టర్ అధికారులతో చర్చించారు.


