News January 22, 2025
జువైనల్ హోమ్ ఘటనపై స్పందించిన హోం మంత్రి

విశాఖలోని జువైనల్ హోమ్ ఘటనపై హోంమంత్రి వంగలపూడి అనిత స్పందించారు. నగర పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చీ, విశాఖ కలెక్టర్ హరేంధిర ప్రసాద్తో ఫోన్లో మాట్లాడారు. బాలికల ఆరోపణలపై ఆరా తీశారు. మహిళా పోలీస్ అధికారి, తహశీల్దార్ నేతృత్వంలో బాలికలతో మాట్లాడి వివరాలు తెలుసుకోవాలని అన్నారు. తక్షణమే విచారణ చేపట్టి సమగ్ర నివేదిక ఇవ్వాలని కలెక్టర్ని ఆదేశించారు. ఆరోపణలు వాస్తవమని తెలితే కఠిన చర్యలు తప్పవన్నారు.
Similar News
News October 31, 2025
UPSC పరీక్షల నిర్వహణకు పూర్తిస్థాయిలో ఏర్పాట్లు: విశాఖ JC

నవంబర్ 2న నిర్వహించనున్న UPSC (యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్) పరీక్షలకు ఏర్పాట్లు చేయాలని జిల్లా జాయింట్ కలెక్టర్ కె.మయూర్ అశోక్ ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్లో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. 7 కేంద్రాల్లో జరిగే ఈ పరీక్షలకు 3268 మంది హాజరుకానునట్లు వెల్లడించారు. అభ్యర్థులకు ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని JC ఆదేశించారు.
News October 31, 2025
విశాఖ: ఆర్టీసీలో డ్రైవర్ పోస్ట్ల భర్తీ

ఆర్టీసీలో పదోన్నతుల కారణంగా డ్రైవర్ పోస్టులు ఖాళీ ఏర్పడ్డాయని రీజనల్ మేనేజర్ అప్పలనాయుడు తెలిపారు. ఐటీఐ చేసి 18 నెలల హెవీ డ్రైవింగ్ లైసెన్సు ఉన్న వారిని ఎంపిక చేయడం జరుగుతుందని వెల్లడించారు. ఔట్సోర్సింగ్ పద్ధతిలో అన్కాల్ డ్రైవర్గా తీసుకోవడం జరుగుతుందని, దగ్గర్లో ఉన్న డిపోల్లో మేనేజర్లను సంప్రదించాలని ఆయన సూచించారు. ఈ సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు.
News October 31, 2025
విశాఖ: ‘ఫైన్లు ఈ విధంగా చెల్లించాలి’

రవాణా శాఖ, పోలీసు డిపార్టుమెంట్ వాహన తనిఖీలలో భాగంగా నమోదైన కేసులల్లో విధించిన ఫైన్లు చెల్లించాలని ఉప రవాణా కమిషనర్ ఆర్.సి.హెచ్.శ్రీనివాస్ శుక్రవారం తెలిపారు. తనిఖీలలో భాగంగా రాసిన కేసులను (https://echallan.parivahan.gov.in/) సైట్ ద్వారా చెల్లించాలన్నారు. రవాణా, రవాణేతర వాహనాల త్రైమాసం పన్నులు, ఇతర సేవలకై vahan.parivahan.gov.in చెల్లించవచ్చన్నారు.


