News July 1, 2024
జూన్లో సాధారణానికి మించి వాన

ఖమ్మం జిల్లాలో జూన్ నెలలో సాధారణానికి మించి వర్షపాతం నమోదైంది. ఈ నెల సాధారణ వర్షపాతం 124.6 మి.మీ.లు కాగా ఆదివారం రాత్రి వరకు 198.8 మి.మీ.గా నమోదైందని అధికారులు తెలిపారు. ఇందులో శనివారం కురిసిన వర్షమే ఎక్కువ. జిల్లాలోని 16 మండలాల్లో సాధారణానికి మించి, కారేపల్లి, కామేపలి , తల్లాడ, ఏన్కూరు, ఎర్రుపాలెం మండలాల్లో సాధారణ వర్షపాతం నమోదైంది. గత ఏడాది జూన్లో కేవలం 49.5 మి.మీ.ల వర్షపాతమే నమోదైంది.
Similar News
News November 15, 2025
KMM: జీవనశైలి మార్పులతో మధుమేహం నియంత్రణ: కలెక్టర్

ప్రపంచ మధుమేహ దినోత్సవం సందర్భంగా ఖమ్మం కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అవగాహన కార్యక్రమాన్ని ప్రారంభించారు. మధుమేహం ‘సైలెంట్ కిల్లర్’ అని పేర్కొంటూ, రోజూ అరగంట నడక, వైట్ రైస్ తగ్గించడం, చిరుధాన్యాలు తీసుకోవడం ద్వారా నియంత్రణ సాధ్యమన్నారు. పిల్లల్లో షుగర్ పెరుగుతున్నందున ఫోన్ వాడకాన్ని తగ్గించాలని సూచించారు. ఖమ్మం జిల్లాలో 55,829 మంది షుగర్ రోగులకు మందులు అందిస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు.
News November 15, 2025
ఖమ్మం: చెరువులకు చేరుతున్న ‘చేప పిల్లలు’

ఖమ్మం జిల్లా మత్స్యకారుల ఆర్థికాభివృద్ధికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని మత్స్యశాఖాధికారి జి. శివప్రసాద్ తెలిపారు. జిల్లాలోని 882 చెరువులలో మొత్తం 3.48 కోట్ల చేప పిల్లలను వదిలేందుకు కార్యాచరణ రూపొందించారు. ఇప్పటివరకు 202 చెరువుల్లో 65 లక్షల కట్ల, రవ్వు, మరిగాల చేప పిల్లలను విడుదల చేశారు. మత్స్యకారుల స్వావలంబన కోసమే ఈ కార్యక్రమం జరుగుతోందని ఆయన వివరించారు.
News November 14, 2025
భూ సమస్యలపై నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు: కలెక్టర్

భూ సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని శుక్రవారం నిర్వహించిన వీసీలో ఖమ్మం కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి హెచ్చరించారు. భూ భారతి, సాదా బైనామా, రెవెన్యూ సదస్సుల పెండింగ్ దరఖాస్తులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. అనర్హుల దరఖాస్తులను డెస్క్ స్క్రూటినీలో తిరస్కరించాలని, అర్హుల దరఖాస్తులకు క్షేత్రస్థాయిలో తప్పనిసరి పరిశీలన చేయాలన్నారు.


