News June 18, 2024
జూన్ 21న వర్చువల్ సేవల కోటా విడుదల

తిరుమల శ్రీవారి వర్చువల్ సేవలు, వాటి దర్శన స్లాట్లకు సంబంధించిన సెప్టెంబర్ నెల కోటాను 21న మధ్యాహ్నం 3 గంటలకు టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనుంది. అంగప్రదక్షిణం టోకెన్ల కోటాను జూన్ 22న ఉదయం 10 గంటలకు, శ్రీవాణి ట్రస్టు టికెట్లకు ఆన్ లైన్ కోటాను జూన్ 22వ తేదీ ఉదయం 11 గంటలకు, వృద్ధులు, దివ్యాంగుల దర్శన కోటాను 22న మధ్యాహ్నం 3 గంటలకు టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనుంది.
Similar News
News November 13, 2025
MP మిథున్ రెడ్డికి జనసేన కౌంటర్

మిథున్ రెడ్డి సోషల్ మీడియాలో బుకాయిస్తే ఆయన తండ్రి <<18276752>>ఆక్రమణలు <<>>సక్రమం కావని జనసేన విమర్శించింది. ‘1968 SEP 16న మంగళంపేట ఫారెస్ట్ గెజిట్ ప్రకారం 76ఎకరాలున్న మీ భూమి 103.98 ఎకరాలు ఎలా అయ్యిందో చెబుతారా మిథున్ రెడ్డి. అడవిని ఎలా కబ్జా చేశారో మీ తండ్రిని అడగండి. 32.63ఎకరాల అడవిని కబ్జా చేసేసినంత ఈజీ కాదు చట్టం నుంచి తప్పించుకోవడం. కాసేపట్లో మీ కబ్జా చిట్టా బయటికి వస్తుంది’ అని ట్వీట్ చేసింది
News November 13, 2025
కాణిపాకంలో జైళ్ల శాఖ డీజీపీ

కాణిపాకం శ్రీవరసిద్ధి వినాయక స్వామి వారిని గురువారం జైళ్ల శాఖ డీజీపీ ఆంజనీ కుమార్ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు ఆయనకు స్వాగతం పలికారు. దర్శనం అనంతరం తీర్థ ప్రసాదాలతో పాటు స్వామివారి చిత్రపటం బహుకరించారు. వేద పండితులు వేద ఆశీర్వచనాలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఏఈఓ రవీంద్రారెడ్డి పాల్గొన్నారు.
News November 13, 2025
జైళ్ల శాఖ డీజీపీని కలిసిన చిత్తూరు SP

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జైళ్ల శాఖ డీజీపీ అంజనీ కుమార్ను గురువారం చిత్తూరు ఎస్పీ తుషార్ డూడీ మర్యాదపూర్వకంగా కలిశారు. జిల్లాకు వచ్చిన ఆయన్ను పోలీసు గెస్ట్ హౌస్లో కలిసి బొకే అందజేసి స్వాగతం పలికారు. అలాగే అడిషనల్ ఎస్పీ రాజశేఖర్ రాజు ఆయన్ను కలిశారు.


