News May 24, 2024
జూన్ 6వ తేదీ వరకు బాణాసంచా విక్రయించరాదు: బాపట్ల ఎస్పీ

ఎన్నికల కౌంటింగ్ నేపథ్యంలో జూన్ 6వ తేదీ వరకు బాణాసంచా విక్రయించరాదని బాపట్ల జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ సూచించారు. గురువారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. పెట్రోల్ బంకులలో కేవలం వాహనాలలో మాత్రమే పెట్రోల్ పోయాలని, బాటిళ్లలో పోయవద్దని సూచించారు. యువత తమ ఉజ్వల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని అల్లర్లకు దూరంగా ఉండాలని కోరారు. జిల్లాలో సమస్యాత్మక గ్రామాలపై ప్రత్యేక దృష్టి సారించామని తెలిపారు.
Similar News
News December 16, 2025
GNT: గంజాయి సేవిస్తున్న ఐదుగురు యువకులు అరెస్ట్

గుంటూరు తూర్పు నియోజకవర్గంలో గంజాయి మూలాలను కూకటివేళ్లతో పెకలించి వేస్తున్నామని DSP అబ్దుల్ అజీజ్ అన్నారు. పాతగుంటూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రగతీనగర్ అబ్దుల్ బాబా మసీదు ఎదురు ఖాళీస్థలంలో ఐదుగురు యువకులు గంజాయి సేవిస్తుండగా పట్టుకున్నారు. పాతగుంటూరు పోలీసులు అరెస్ట్ చేయగా కేసు వివరాలను DSP వివరించారు. వారి వద్ద నుంచి 20గ్రాముల గంజాయి, 4 గ్రాముల లిక్విడ్ గంజాయిని స్వాధీనం చేసుకున్నామని చెప్పారు.
News December 16, 2025
GNT: మృతదేహాల తరలింపులోనూ వసూళ్ల దందా.!

ఎంతో ఘన చరిత్ర ఉన్న గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో మహాప్రస్థానం వాహనాల డ్రైవర్లు వసూళ్ల దందాకు పాల్పడుతున్నట్లు బాధితులు వాపోతున్నారు. మృతదేహాన్ని ఉచితంగా గమ్యస్థానానికి చేర్చాల్సిన మహాప్రస్థానం వాహన డ్రైవర్లు దూరాన్ని బట్టి డబ్బులు వసూలు చేస్తున్నారు. ప్రాణం కోల్పోయిన బాధలో ఉన్న కుటుంబాలను కూడా బ్లాక్ మెయిల్ చేస్తున్నారని, అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని బాధితులు వాపోతున్నారు.
News December 16, 2025
పది పరీక్షల్లో జిల్లాను అగ్రగామిగా నిలపాలి: DEO

గుంటూరు జిల్లాను రానున్న 10వ తరగతి పరీక్షల్లో రాష్ట్రంలో అగ్రగామిగా నిలపాలని జిల్లా విద్యాశాఖ అధికారి సలీమ్ బాషా సూచించారు. గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలోని PPD, SJR మున్సిపల్ కార్పొరేషన్ హైస్కూల్స్‌ని మంగళవారం DEO పరిశీలించారు. 10వ తరగతి స్లిప్ టెస్ట్ పరీక్షా పత్రాలను పరీక్షించారు. ప్రతి పాఠశాలలో 100 రోజుల ప్రణాళికలు అమలవ్వాలని ఆదేశించారు. ఆయన వెంట మండల విద్యాశాఖాధికారి అబ్దుల్ ఖుద్దూస్ ఉన్నారు.


