News May 18, 2024
జూన్ 6 వరకు ‘నో మ్యాన్ జోన్’గా నన్నయ వర్సిటీ: వీసీ

ఎన్నికల నేపథ్యంలో తూ.గో కలెక్టర్ సూచనల మేరకు నన్నయ విశ్వవిద్యాలయంలో రోజువారి కార్యక్రమాలను జూన్ 6 వరకు నిలిపివేస్తున్నట్లు వీసీ కె.పద్మరాజు తెలిపారు. ఈవీఎంలు, ఎన్నికల సామగ్రి, ఓట్ల లెక్కింపు కోసం టేబుల్స్, స్ట్రాంగ్ రూమ్స్ ఉన్న కారణంగా క్యాంపస్‌ను ‘నో మ్యాన్ జోన్’గా కలెక్టర్ ప్రకటించారని పేర్కొన్నారు. విశ్వవిద్యాలయ అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బంది, విద్యార్థులు సహకరించాలని వీసీ కోరారు.
Similar News
News December 8, 2025
ప.గో జిల్లా కీలక నేత వైసీపీకి ‘బై’

తాడేపల్లిగూడేనికి చెందిన వైసీపీ ఎస్టీ విభాగం జిల్లా మాజీ అధ్యక్షుడు కావాడి శివ పార్టీకి గుడ్ బై చెప్పారు. ఈ మేరకు తన రాజీనామా పత్రాన్ని జిల్లా పార్టీ అధ్యక్షుడు ప్రసాద్ రాజుకు అందజేసినట్లు సోమవారం తెలిపారు. పార్టీ కార్యక్రమాల సమాచారం ఇవ్వకపోవడం, తగిన గుర్తింపు లేకపోవడం వంటి కారణాలతో పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. భవిష్యత్తు కార్యాచరణను త్వరలో ప్రకటిస్తానన్నారు.
News December 8, 2025
ఘోర అగ్నిప్రమాదంలో తాడేపల్లిగూడెం యువకుడి మృతి

అమెరికాలోని బర్మింగ్ హామ్‌లో జరిగిన ఘోర అగ్నిప్రమాదంలో ఇద్దరు తెలుగు విద్యార్థులు మృతి చెందిన విషయం తెలిసిందే. అందులో తాడేపల్లిగూడేనికి చెందిన అన్వేష్ రెడ్డి ఒకరు. ఘటనలో తీవ్రగాయాలు కాగా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయాడు. కాగా వీరి కుటుంబం HYDలోని కూకట్ పల్లిలో నివాముంటోంది.
News December 8, 2025
ప.గో: బాలికలపై టీచర్ లైంగిక వేధింపులు..!

విద్యార్థినులను ఉపాధ్యాయుడు లైంగిక వేధింపులకు గురిచేస్తున్న ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. భీమవరం మండలం గొల్లవానితిప్ప ఉన్నత పాఠశాల బాలికలను మ్యాథ్స్ టీచర్ లైంగికంగా వేధించినట్లు తెలియడంతో తల్లిదండ్రుల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై తాజాగా నిర్వహించిన PTMలో తల్లిదండ్రులు అధికారులకు వివరించారు. చట్టపరంగా ఉపాధ్యాయుడిపై చర్యలు తీసుకుంటామని ఉన్నతాధికారులు పేర్కొన్నారు.


