News May 18, 2024
జూన్ 6 వరకు ‘నో మ్యాన్ జోన్’గా నన్నయ వర్సిటీ: వీసీ
ఎన్నికల నేపథ్యంలో తూ.గో కలెక్టర్ సూచనల మేరకు నన్నయ విశ్వవిద్యాలయంలో రోజువారి కార్యక్రమాలను జూన్ 6 వరకు నిలిపివేస్తున్నట్లు వీసీ కె.పద్మరాజు తెలిపారు. ఈవీఎంలు, ఎన్నికల సామగ్రి, ఓట్ల లెక్కింపు కోసం టేబుల్స్, స్ట్రాంగ్ రూమ్స్ ఉన్న కారణంగా క్యాంపస్‌ను ‘నో మ్యాన్ జోన్’గా కలెక్టర్ ప్రకటించారని పేర్కొన్నారు. విశ్వవిద్యాలయ అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బంది, విద్యార్థులు సహకరించాలని వీసీ కోరారు.
Similar News
News December 12, 2024
ప.గో జిల్లాలో మాజీ సీఎం జగన్ పర్యటన
సంక్రాంతి తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా పర్యటనలు చేస్తానని మాజీ సీఎం జగన్ ప్రకటించిన విషయం తెలిసిందే. ముందుగా ఆయన పర్యటన ఉభయ గోదావరి జిల్లాలో ఉంటుందని తెలుస్తోంది. ఈ మేరకు స్థానిక నాయకులు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. జగన్ గోదావరి జిల్లా పర్యటన చేస్తారని వైసీపీ చింతలపూడి ఇన్‌ఛార్జ్ కంభం విజయరాజు తెలిపారు. సంక్రాంతి తర్వాత జగన్ గోదావరి జిల్లా ప్రజలను కలుస్తారని చెప్పారు.
News December 12, 2024
ఏలూరు జిల్లాలో 354 నీటి సంఘాలు: కలెక్టర్
జిల్లా సాగునీటి సంఘాల ఎన్నికల నిర్వహణకు గెజిట్ నెం.62 బుధవారం జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి విడుదల చేశారు. జిల్లాలో 354 నీటి వినియోగదారుల సంఘాలు ఉన్నాయని, వీటిలో 23 గోదావరి పడమర, కృష్ణా- తూర్పు నీటి కాలువ 54 సంఘాలు, నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ ఎడమ 15, తమ్మిలేరు ఇరిగేషన్ ప్రాజెక్ట్ 6 నీటి సంఘాలు, శ్రీ కరాటం కృష్ణమూర్తి ఎర్రకాలువకు 5, మైనర్ ఇరిగేషన్ చెరువులకు 251 సంఘాలు ఉన్నాయన్నారు.
News December 11, 2024
కొవ్వూరు: ఉరి వేసుకొని వివాహిత ఆత్మహత్య
కొవ్వూరు శ్రీరామ కాలనీకి చెందిన నేతల వీరబాబు భార్య నేతల దేవి (21) ఉదయం ఇంట్లో ఎవరు లేని సమయంలో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. పోలీసుల వివరాల మేరకు భర్తకు ఫోన్ చేసి చికెన్ తెమ్మని చెప్పగా చికెన్ పట్టుకొని ఇంటికి వచ్చిన భర్తకు దేవి ఫ్యాన్‌కు వేలాడుతూ కనబడుతుంది. స్థానికులు పోలీసులకు సమాచారంతో ఘటనా స్థలికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. వివరాలు తెలియాల్సి ఉంది.