News February 28, 2025
జూపార్కు ధరలు పెంపు.. రేపటి నుంచి అమల్లోకి

HYD నెహ్రూ జూలాజికల్ పార్కు ప్రవేశ టికెట్లతో పాటు అన్ని రకాల టికెట్లపై ధరలను రాష్ట్ర అటవీ శాఖ ఆదేశాల మేరకు జూపార్క్ అధికారులు పెంచారు. రేపటి నుంచి పెరిగిన ధరలు అమలులోకి వస్తాయని జూపార్క్ క్యూరేటర్ వసంత తెలిపారు. 2 ఏళ్ల తర్వాత జూ పార్క్ టికెట్ల ధరలను పెంచారు. జూపార్క్ ప్రవేశ టికెట్ రూ.100, చిన్న పిల్లలకు రూ.50లతో పాటు జూలోని మరిన్నింటికి ధరలు పెంచారు.
Similar News
News February 28, 2025
రోజంతా కూర్చొని పనిచేస్తున్నారా?

ప్రస్తుతం చాలా మంది ఒకేచోట 9-12 గంటలు కూర్చొని పనిచేయాల్సి వస్తోంది. అయితే, ఇలా ఎక్కువసేపు కూర్చోవడం ప్రమాదకరమని అమెరికన్ అకాడమీ ఆఫ్ న్యూరాలజీ అధ్యయనంలో వెల్లడైంది. వీరిలో చిత్తవైకల్యం, స్ట్రోక్, ఆందోళన, నిరాశతో పాటు నిద్రలేమి సమస్యలొస్తాయని పేర్కొంది. ఇలాంటి జాబ్స్ చేసేవారు శారీరక వ్యాయామం చేయడం వల్ల ఈ ప్రమాదాల నుంచి బయటపడొచ్చని సూచించింది. ఈ అధ్యయనంలో 73,411 మంది పాల్గొన్నారు.
News February 28, 2025
కేజీహెచ్‌లో నకిలీ డాక్టర్.. రూ.లక్షతో పరార్..!

KGHలో ఓ నకిలీ డాక్టర్ బాధితుని వద్ద రూ.లక్ష కాజేసిన ఘటన వెలుగు చూసింది. శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటకు చెందిన దూసి రామ్‌జీ కొంతకాలంగా కిడ్నీ ప్రాబ్లంతో బాధపడుతూ కేజీహెచ్‌లో చికిత్స పొందుతున్నాడు. వీరు కిడ్నీ అవసరమని పేపర్లో ప్రకటన ఇవ్వగా ఓ వ్యక్తి నకిలీ డాక్టర్ అవతారం ఎత్తి రూ.లక్ష కాజేశాడు. మోసపోయాయని గ్రహించిన రాంజీ పోలీసులకు ఫిర్యాదు చేయగా.. విశాఖ వన్ టౌన్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
News February 28, 2025
భూపాలపల్లి: ప్రతి ప్రభుత్వ ఉద్యోగికి ఉద్యోగ విరమణ తప్పనిసరి: ఎస్పీ

ప్రతి ప్రభుత్వ ఉద్యోగికి ఉద్యోగ విరమణ తప్పనిసరి అని జిల్లా ఎస్పీ కిరణ్ ఖరే అన్నారు. శుక్రవారం జిల్లా పోలీసు కార్యాలయంలో AR హెడ్ కానిస్టేబుల్‌గా విధులు నిర్వర్తించి ఉద్యోగ విరమణ పొందిన, హెడ్ కానిస్టేబుల్ గుండు నాగభూషణంను ఎస్పీ శాలువా, పులమాలతో ఘనంగా సత్కరించారు. అలాగే ఆయన సతీమణి పద్మకు గృహోపకరణాలు అందజేశారు. కుటుంబాలకు దూరంగా ఉంటూ ప్రజలకు సేవలందించడం ఎంతో గర్వకారణమని ఎస్పీ అన్నారు.