News April 14, 2025
జూబ్లీహిల్స్ పెద్దమ్మను దర్శించుకున్న నితీశ్ కుమార్ రెడ్డి

సన్ రైజర్స్ హైదరాబాద్ క్రికెటర్ నితీష్ కుమార్ రెడ్డి సోమవారం జూబ్లీహిల్స్ పెద్దమ్మ గుడిలో అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు ఆయనకు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అనంతరం ఆయన అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. శనివారం జరిగిన మ్యాచ్‌లో సన్ రైజర్స్ జట్టు విజయం సాధించిన సందర్భంగా ఆయన అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు.
Similar News
News November 21, 2025
సెలవులో గుంటూరు ఎస్పీ వకుల్ జిందాల్

గుంటూరు ఎస్పీ వకుల్ జిందాల్ సెలవు తీసుకొని కుటుంబ సభ్యులతో కలిసి సొంత రాష్ట్రమైన పంజాబ్ వెళ్లారు. ఈ నెల 26న తిరిగి గుంటూరు వచ్చి మరుసటి రోజు అంటే 27న ఎస్పీ వకుల్ జిందాల్ విధుల్లోకి చేరనున్నారు. ఈ నేపథ్యంలో పల్నాడు జిల్లా ఎస్పీ కృష్ణారావును పోలీస్ శాఖ ఉన్నతాధికారులు గుంటూరు జిల్లా ఇన్‌ఛార్జ్ ఎస్పీగా నియమించారు.
News November 21, 2025
నేడు కామారెడ్డిలో జాబ్ మేళా

నిరుద్యోగుల కోసం ప్రైవేటు రంగంలో ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు శుక్రవారం కలెక్టరేట్‌లోని ఉపాధి కల్పనా కార్యాలయంలో జాబ్ మేళా నిర్వహించనున్నట్లు ఉపాధి కల్పన అధికారి కిరణ్ కుమర్ తెలిపారు. ఆసక్తి గల నిరుద్యోగులు విద్యార్హత సర్టిఫికెట్లు, ఆధార్ కార్డు, ఫొటోలతో ఇంటర్వ్యూలకు హాజరై సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. మరిన్ని వివరాలకు 6300057052, 7671974009 నంబర్లను సంప్రదించాలన్నారు.
News November 21, 2025
KNR: మంత్రి పొన్నం ప్రభాకర్ జిల్లా పర్యటన రద్దు

నేడు కరీంనగర్‌లో జరగాల్సిన మంత్రి పొన్నం ప్రభాకర్ పర్యటన వాయిదా పడింది. హైదరాబాదులో రాష్ట్రపతి పర్యటన నేపథ్యంలో ప్రోగ్రాం వాయిదా పడ్డట్లు మంత్రి కార్యాలయం తెలిపింది. LMD వద్ద నిర్వహించనున్న చేపపిల్లల పంపిణీ కార్యక్రమాన్ని అధికారులు నిర్వహిస్తారని, కొత్తపల్లి మండలంలో నిర్వహించే మహిళా శక్తి చీరల పంపిణీ కార్యక్రమాన్ని ప్రస్తుతానికి వాయిదా వేస్తున్నట్లు పేర్కొంది. దీనిని మరోరోజు నిర్వహించనున్నారు.


