News March 6, 2025

జూబ్లీహిల్స్: సీఎంని కలిసిన పింగిలి శ్రీపాల్ రెడ్డి

image

సీఎం రేవంత్ రెడ్డిని వరంగల్ – ఖమ్మం – నల్గొండ నుంచి శాసనమండలికి ఎన్నికైన పింగిలి శ్రీపాల్‌రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్న ప్రజాప్రభుత్వానికి సహకరిస్తామని తెలిపారు. ఈ ఎన్నికలో విజయం సాధించిన శ్రీపాల్ రెడ్డికి ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి అభినందనలు తెలిపారు.

Similar News

News November 3, 2025

HYD: మృతులకు రూ.50 లక్షలు ఎక్స్‌గ్రేషియా ప్రకటించాలి: సీపీఐ

image

చేవెళ్ల మండలం మీర్జాగూడ రోడ్డు ప్రమాదంలో 21 మంది మృతిచెందడంపై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. HYDలో ఆయన మాట్లాడుతూ.. గాయపడిన వారికి ప్రభుత్వం పూర్తి వైద్య ఖర్చులు భరించాలని, మృతుల కుటుంబాలకు రూ.50 లక్షలు, క్షతగాత్రులకు రూ.25 లక్షల పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు.

News November 3, 2025

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక.. రేవంత్ రెడ్డి ‘7 రోజుల ప్రచార వ్యూహం’

image

జూబ్లీహిల్స్ ఉపఎన్నికకు కేవలం 9 రోజులు మాత్రమే మిగిలి ఉండగా సీఎం రేవంత్ రెడ్డి ప్రధాన ప్రతిపక్షం BRSను లక్ష్యంగా చేసుకుని ‘7 రోజుల ప్రచార వ్యూహం’ను అనుసరించేందుకు సిద్ధమయ్యారు. ఈవ్యూహంలో KCR అవినీతి పాలన చేశారనే విషయాన్ని రేవంత్ రెడ్డి హైలైట్ చేయనున్నారు. BRSనేతల ఇంటింటి ప్రచారానికి దీటుగా కాంగ్రెస్ పాలనలో అభివృద్ధిపై ప్రచారం చేయాలని మంత్రులను కోరారు. GHMC మేయర్ విజయలక్ష్మి పర్యవేక్షించనున్నారు.

News November 3, 2025

BREAKING: HYD: బాలానగర్‌లో MURDER

image

HYD బాలానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈరోజు దారుణ హత్య జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలు.. ఐడీపీఎల్ బస్టాప్ సమీపంలో గఫర్(39) అనే వ్యక్తిపై గుర్తుతెలియని వ్యక్తులు దాడి చేశారు. దాడిలో తీవ్రంగా గాయపడి రక్తస్రావం కారణంగా గఫర్ ఘటనా స్థలంలోనే మృతిచెందాడు. సమాచారం అందుకున్న బాలానగర్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించారు.