News April 4, 2025

జూరాలలో పోలీస్ అవుట్ పోస్ట్‌కు డీజీపీ భూమి పూజ 

image

వనపర్తి జిల్లా అమరచింత మండలం ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టులో నూతనంగా ఏర్పాటు చేసే పోలీస్ అవుట్ పోస్ట్ భవన నిర్మాణానికి రాష్ట్ర డీజీపీ జితేందర్ శుక్రవారం భూమి పూజ చేశారు. రూ.కోటితో దీనిని నిర్మించినట్లు డీజీపీ తెలిపారు. ఈ కార్యక్రమంలో మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి, ఐజీ రమేశ్ రెడ్డి, డీఐజీ చౌహన్, ఎస్పీ రావుల గిరిధర్, కేశం నాగరాజు గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

Similar News

News November 22, 2025

ఉమ్మడి చిత్తూరు జిల్లాలో టమాటా ధరలు

image

ఉమ్మడి చిత్తూరు జిల్లాలో టమాటా ధరలు శనివారం ఇలా ఉన్నాయి. ములకలచెరువులో నాణ్యత గల టమాటా 10 కిలోలు రూ. 520, పుంగనూరులో రూ. 500, పలమనేరులో రూ.490, వీకోటలో రూ.520, కలికిరిలో రూ.510, మదనపల్లెలో రూ. 630 వరకు పలుకుతున్నట్టు మార్కెట్ వర్గాలు తెలిపాయి. ధరల పెరుగుదలతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

News November 22, 2025

ఆమదాలవలస: రైలు నుంచి జారిపడి ఒకరు మృతి

image

శ్రీకాకుళం రోడ్డు (ఆమదాలవలస )రైల్వే స్టేషన్ సమీపంలో తాండ్రసి మెట్ట వద్ద రైలు నుంచి జారిపడి ఒకరు మృతి చెందినట్లు జీఆర్పీ ఎస్ఐ ఎం.మధుసూదనరావు శనివారం తెలిపారు. మృతుని వయస్సు సుమారు 40 ఏళ్లు ఉన్నాయని, నల్లటి దుస్తులు ధరించినట్లు చెప్పారు. కేసు నమోదు చేసి, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం రిమ్స్‌కు తరలించినట్లు చెప్పారు.

News November 22, 2025

6 నెలల్లో అమరావతి రైతుల సమస్య పరిష్కారం: కమిటీ

image

AP: అమరావతి రైతుల స‌మ‌స్య‌ల‌ను 6నెలల్లోగా ప‌రిష్క‌రిస్తామ‌ని త్రీమెన్ క‌మిటీ హామీ ఇచ్చింది. 98% ప్లాట్ల కేటాయింపు పూర్తయిందని, ఇంకా 700 ఎకరాలపై సమస్య ఉందని మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. పరిశీలన తర్వాత జరీబు, మెట్టభూముల సమస్య పరిష్కరిస్తామని చెప్పారు. లంకభూములపై గ్రీన్ ట్రిబ్యునల్‌ తీర్పు FEBలో వచ్చే అవకాశముందన్నారు. 719 మందికి మాత్రమే ఇంకా ప్లాట్లు ఇవ్వాల్సి ఉందని మంత్రి నారాయణ చెప్పారు.