News April 4, 2025
జూరాలలో పోలీస్ అవుట్ పోస్ట్‌కు డీజీపీ భూమి పూజ

వనపర్తి జిల్లా అమరచింత మండలం ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టులో నూతనంగా ఏర్పాటు చేసే పోలీస్ అవుట్ పోస్ట్ భవన నిర్మాణానికి రాష్ట్ర డీజీపీ జితేందర్ శుక్రవారం భూమి పూజ చేశారు. రూ.కోటితో దీనిని నిర్మించినట్లు డీజీపీ తెలిపారు. ఈ కార్యక్రమంలో మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి, ఐజీ రమేశ్ రెడ్డి, డీఐజీ చౌహన్, ఎస్పీ రావుల గిరిధర్, కేశం నాగరాజు గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
Similar News
News July 11, 2025
NLG: వట్టె జానయ్య ఫోన్ ట్యాపింగ్ కలకలం

ఉమ్మడి నల్గొండలో ఫోన్ ట్యాపింగ్ రాజకీయంగా హాట్ టాపిక్‌గా మారింది. DCMS మాజీ ఛైర్మన్ వట్టె జానయ్య ఫోన్ ట్యాపింగ్ అయిందని సిట్ అధికారులు నిర్ధారించారు. ఈనెల 14న విచారణకు హాజరై వాంగ్మూలం ఇవ్వాలని ఆయనకు నోటీసులు ఇచ్చారు. గతంలో జిల్లాలో పలువురు నేతల ఫోన్లు ట్యాప్ అయినట్లు ఆరోపణలు వచ్చినా, ఇది అధికారులిచ్చిన తొలి నోటీసు కావడం గమనార్హం. జిల్లాలో ఇంకెంత మంది నేతలు ట్యాపింగ్ బారిన పడ్డారో తెలియాల్సి ఉంది.
News July 11, 2025
కాకినాడతో నాకు ఎంతో అనుబంధం: నటుడు సుమన్

కాకినాడ రూరల్ వలస పాకలలో సాయిబాబా గుడి వద్ద గ్రామ పెద్దల ఆధ్వర్యంలో గురువారం గురు పౌర్ణమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా సీనియర్ సినీ హీరో నటుడు సుమన్ పాల్గొన్నారు. జనసేన యువ నాయకుడు పంతం సందీప్ హీరో సుమన్ ఘనంగా సత్కరించారు. వేద పండితులు ఆయనను ఆశీర్వదించారు. సుమన్ మాట్లాడుతూ.. కాకినాడ తో తనకు ఎంతో అనుబంధం ఉందని తెలిపారు.
News July 11, 2025
HYD: కల్తీ కల్లు తాగి ఎనిమిది మంది మృతి

కల్తీ కల్లు <<17017648>>రాజేసిన అగ్గి<<>> ఇంకా చల్లారడంలేదు. ఈ ప్రమాదపు కల్లు తాగి అస్వస్థతకు గురై చికిత్స పొందుతూ పెద్ద గంగారాం (70) అర్ధరాత్రి 1:30కు గాంధీ హాస్పిటల్‌లో మృతి చెందాడు. కూకట్‌పల్లి PS పరిధిలోని ఆదర్శనగర్‌లో ఆయన నివాసం ఉండేవారు. ఈయన మరణంతో మృతుల సంఖ్య ఎనిమిదికి చేరింది. 30 మందికి పైగా వేర్వేరు ఆస్పత్రుల్లో చికిత్స పొంతుతున్నారు.