News October 5, 2024
జూరాలలో 11 యూనిట్లలో విద్యుదుత్పత్తి
జూరాల ఎగువ, దిగువ విద్యుత్ కేంద్రాలలో శుక్రవారం 11 యూనిట్లలో విద్యుదుత్పత్తి చేపట్టినట్లు ఎస్ఈ సూరిబాబు తెలిపారు. ఎగువలో 5 యూనిట్ల ద్వారా 196 మెగావాట్లు, 229.586 ఎం యూ, దిగువలో 6 యూనిట్ల ద్వారా 240 మెగావాట్లు 204.994 ఎంయూ ఉత్పత్తిని చేపట్టామన్నారు. ఎగువ, దిగువ జలవిద్యుత్ ఉత్పత్తి కేంద్రాల్లో ఇప్పటి వరకు 434.580 మిలియన్ యూనిట్ల విద్యుదుత్పత్తిని సాధించామని తెలిపారు.
Similar News
News November 6, 2024
వనపర్తి: ఇంటర్ పరీక్షల ఫీజులు చెల్లించండి
వచ్చే ఏడాది మార్చిలో జరిగే ఇంటర్ వార్షిక పరీక్షలకు విద్యార్థులు ఫీజులు చెల్లించాలని స్థానిక ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ కృష్ణయ్య తెలిపారు. ఇవాళ నుంచి 26 వరకు ఎలాంటి అదనపు రుసుముల లేకుండా ఫీజు చెల్లించవచ్చని ఆయన అన్నారు. ప్రథమ, ద్వితీయ సంవత్సరం విద్యార్థులు కళాశాలలో వార్షిక పరీక్షల ఫీజులు చెల్లించాలని ఆయన పేర్కొన్నారు.
News November 6, 2024
MBNR: లండన్‌లో పర్యటిస్తున్న ఎమ్మెల్యేలు
లండన్ నగరంలో 7, 8 తేదీలలో ప్రపంచ పర్యాటక దినోత్సవ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. తెలంగాణ పర్యాటకశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావుతో పాటు కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి, అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ వెళ్లారు. నల్లమలలోని ప్రకృతి పర్యటక ప్రాంతాలపై, కృష్ణానది పరవళ్లు, పర్యాటకులను ఆకర్షిస్తాయని వివరించారు.
News November 6, 2024
8 తేదీన కొండారెడ్డిపల్లి గ్రామానికి సీఎం రేవంత్ రెడ్డి
నాగర్ కర్నూల్ జిల్లా వంగూరు మండలంలోని కొండారెడ్డిపల్లి గ్రామానికి ఈ నెల 8 తేదీన సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్నట్లు కాంగ్రెస్ నాయకులు తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి స్వంత గ్రామంలో నిర్మిస్తున్న ఆలయ ప్రారంభ ప్రతిష్ఠ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొంటారని తెలిపారు. అనంతరం సీఎం రేవంత్ రెడ్డి పలు కార్యక్రమాలలో పాల్గొంటారని కాంగ్రెస్ నేతలు తెలిపారు.