News September 12, 2024
జూరాల జలాశయంలో 8.531 TMCల నీటి నిల్వ
జూరాల జలాశయంలోకి 1.16 లక్షల క్యూసెక్కులు చేరుతుండగా, దిగువకు 11 గేట్లు, జలవిద్యుదుత్పత్తి ద్వారా 1.10 లక్షల క్యూసెక్కులు వదులుతున్నట్లు అధికారులు తెలిపారు. జలాశయంలో నీటినిల్వ 8.531 TMCల మేర ఉంది. ఆలమట్టి జలాశయంలోకి 64 వేల క్యూసెక్కులు చేరుతుండగా, దిగువకు 40 వేలు వదులుతున్నారు. నారాయణపూర్ జలాశయంలోకి 40 వేలు చేరుతుండగా, దిగువకు 19 వేల క్యూసెక్కులు వదులుతున్నారు.
Similar News
News October 6, 2024
అణగారిన ప్రజల మనిషి కామ్రేడ్ లక్ష్మీదేవమ్మ: కామ్రేడ్ తమ్మినేని
అణగారిన ప్రజల మనిషి కామ్రేడ్ లక్ష్మీదేవమ్మ అని సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి కామ్రేడ్ తమ్మినేని వీరభద్రం అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని ఓ ఫంక్షన్ హాల్‌లో ఆమె సంస్మరణ సభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. లక్ష్యసాధన కోసం చేయవలసిన కృషిని అనుక్షణం గుర్తు చేసే ఆదర్శ జీవితం కామ్రేడ్ లక్ష్మీదేవమ్మది కొనియాడారు. కామ్రేడ్ అరుణ్, జబ్బార్ ఉన్నారు.
News October 6, 2024
MBNR: గ్రంథాలయ సంస్థలకు నూతన ఛైర్మన్‌లు
తెలంగాణలో బతుకమ్మ పండుగకు ముందు నామినేటెడ్ పోస్టుల భర్తీ జాతర మొదలైంది. తాజాగా పాలమూరు జిల్లాలోని గ్రంథాలయ సంస్థలకు ఛైర్మన్‌లను రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. మహబూబ్‌నగర్ – మల్లు నరసింహారెడ్డి, నాగర్ కర్నూల్ – జి. రాజేందర్, వనపర్తి – జి. గోవర్ధన్, గద్వాల- నీలి శ్రీనివాసులు, నారాయణ్‌పేట్-వరాల విజయ్ కుమార్‌ను జిల్లా గ్రంథాలయ సంస్థలకు నూతన ఛైర్మన్‌గా నియమించింది.