News September 10, 2024
జూరాల 26 గేట్లు ఎత్తివేత
జూరాల ప్రాజెక్టుకు వరద ప్రవాహం గంటగంటకు పెరుగుతోంది. కర్ణాటకలో భారీ వర్షాలు కురవడంతో ఆల్మట్టి డ్యాం పూర్తిస్థాయిలో నిండిపోవడంతో దిగువకు రెండు లక్షలకు పైగా వరద నీరు వదలడంతో జూరాల ప్రాజెక్టు నిండుకుండను తలపిస్తుంది. దీంతో అప్రమత్తమైన అధికారులు డ్యాం 26 గేట్లు ఎత్తి 2 లక్షల వరద నీటిని దిగువకు వదులుతున్నారు. దీంతో కృష్ణమ్మ ఉగ్రరూపం దాల్చింది. నది తీర ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు.
Similar News
News October 5, 2024
కల్వకుర్తి: సూర్య ప్రకాశ్ రావును అభినందించిన కేటీఆర్
కల్వకుర్తి పట్టణ సమీపంలోని సూర్యలత స్పిన్నింగ్ మిల్లులో ఇటీవల జరిగిన కార్మిక సంఘం గుర్తింపు ఎన్నికలలో బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించిన సూర్య ప్రకాశ్ రావును మాజీ మంత్రి కేటీఆర్ శనివారం అభినందించారు. మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్‌తో కలిసి వారు కేటీఆర్‌ను కలిశారు.
News October 5, 2024
కొడంగల్: DSC ఫలితాల్లో రాష్ట్రస్థాయిలో 5వ, జిల్లాస్థాయిలో 3వ ర్యాంక్
కొడంగల్ మున్సిపాలిటీ పరిధిలోని గుండ్లకుంటకు చెందిన తిరుమలేశ్ ఇటీవల ప్రభుత్వం విడుదల చేసిన డీఎస్సీ ఫలితాల్లో స్కూల్ అసిస్టెంట్ సోషల్ విభాగంలో రాష్ట్రస్థాయిలో 5వ ర్యాంకు జిల్లాస్థాయిలో 3వ ర్యాంకు సాధించి ఔరా అనిపించుకున్నాడు. రాష్ట్ర, జిల్లా స్థాయిలో ఉత్తమ ర్యాంకు సాధించడం పట్ల పలువురు అభినందనలు తెలిపారు.
News October 5, 2024
ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా నేటి వర్షపాతం వివరాలవే
ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా వ్యాప్తంగా శనివారం నమోదైన వర్షపాత వివరాలు ఇలా ఉన్నాయి. అత్యధికంగా గద్వాల జిల్లా కల్లూరు తిమ్మన్న దొడ్డిలో 49.0 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో 43.5 మిల్లీమీటర్లు, వనపర్తి జిల్లా వెలుగొండలో 35.5 మిల్లీమీటర్లు, నారాయణపేట జిల్లా ధన్వాడలో 33.0 మిల్లీమీటర్లు, మహబూబ్నగర్ జిల్లా మిడ్జిల్లో 17.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.