News November 14, 2024
జూలూరుపాడు: యువతి హత్య UPDATE
జూలూరుపాడు మండలం మాచినేనిపేట తండాలో స్వాతి (28)ని భర్త భానోత్ భద్రం హత్య చేసి <<14604036>>పత్తి <<>>చేనులో పాతి పెట్టిన సంగతి తెలిసిందే. నిందితుడి వివరాల ప్రకారం.. ఆర్థిక సమస్యల నేపథ్యంలో ఈ నెల 9న స్వాతిని కత్తితో నరికి హత్య చేశాడు. అనంతరం అతని తల్లి సహాయంతో ఓ సంచిలో మూటగట్టి చేనులో పాతిపెట్టినట్లు తెలిపాడు. పోలీసుల విచారణలో ఈ విషయం బయటపడింది.
Similar News
News December 9, 2024
ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని నేటి ముఖ్యాంశాలు
∆} ఖమ్మం వ్యవసాయ మార్కెట్ తిరిగి ప్రారంభం ∆} అన్నపు రెడ్డిపల్లి శివాలయంలో ప్రత్యేక పూజలు ∆} పలు శాఖల అధికారులతో ఖమ్మం భద్రాద్రి జిల్లా కలెక్టర్లు సమీక్షా సమావేశం ∆} భద్రాచలంలో ఎమ్మెల్యే వెంకట్రావు పర్యటన ∆} మణుగూరులో విద్యుత్ సరఫరాలో అంతరాయం ∆} సత్తుపల్లిలో ఎమ్మెల్యే రాగమయి పర్యటన ∆} పినపాకలో బీఆర్ఎస్ కార్యక్రమం ∆} ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సోనియా గాంధీ జన్మదిన వేడుకలు
News December 9, 2024
విద్యా వైజ్ఞానిక ప్రదర్శన నిర్వహించుటకు సర్వ సిద్ధం
ఖమ్మం జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు 9, 10 తారీకుల్లో ఎస్ఎఫ్ఎస్ బల్లేపల్లి, పాఠశాలలోని డాక్టర్ విక్రమ్ సారాభాయ్ ప్రాంగణంలో జిల్లా స్థాయి విద్యా వైజ్ఞానిక ప్రదర్శన నిర్వహించుటకు ఏర్పాట్లు చేసినట్లు డిఈఓ సోమశేఖర్ శర్మ తెలిపారు. ప్రదర్శనలో ఇన్స్పైర్‌కు 119 ఎగ్జిబిట్లు, విజ్ఞాన శాస్త్రానికి సంబంధించి 486 ఎగ్జిబిట్లు రిజిస్ట్రేషన్ చేసుకొని ప్రదర్శనకు సిద్ధంగా ఉన్నాయన్నారు.
News December 8, 2024
ఖమ్మం వ్యవసాయ మార్కెట్ రేపు తిరిగి ప్రారంభం
ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో సోమవారం నుంచి క్రయవిక్రయాలు పునః ప్రారంభం కానున్నాయని వ్యవసాయ శాఖ అధికారులు ఆదివారం తెలిపారు. రెండు రోజుల సెలవులు అనంతరం సోమవారం మార్కెట్ ప్రారంభమవుతుందని చెప్పారు. ఈ విషయాన్ని ఉమ్మడి ఖమ్మం జిల్లా రైతాంగ సోదరులు గమనించి తమ పంటలను మార్కెట్‌కు తీసుకువచ్చి అమ్మకాలు జరపాలని అధికారులు పేర్కొన్నారు.