News June 29, 2024
జూలై 1న పెన్షన్ల పంపిణీ: గుంటూరు కలెక్టర్

జూలై 1 ఉదయం 6 గంటల నుంచి ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీకి అన్ని రకాల చర్యలు తీసుకున్నామని జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి తెలిపారు. పెన్షన్ల పంపిణీపై శనివారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా కలెక్టర్లతో నిర్వహించిన సమావేశంలో గుంటూరు కలెక్టర్ నాగలక్ష్మి పాల్గొన్నారు. గ్రామ, వార్డు సచివాలయాల పరిధిలో పెన్షన్ల పంపిణీకి చేసిన ఏర్పాట్లను వివరించారు.
Similar News
News December 8, 2025
GNT: అమృత హెల్త్ కార్డులు అందజేసిన కలెక్టర్

ప్రభుత్వ గుర్తింపు పొందిన అనాథాశ్రమాల్లో నివసిస్తున్న అనాథ పిల్లల సంక్షేమం కోసం ఎన్టీఆర్ వైద్యసేవ/అమృత హెల్త్ స్కీమ్ అమలు చేస్తున్నట్లు కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా అన్నారు. కలెక్టరేట్లో సోమవారం అమృత హెల్త్ కార్డులను కలెక్టర్ చిన్నారులకు అందజేశారు. 39 మంది లబ్దిదారులకు ప్రత్యేక అమృత హెల్త్ కార్డులు పంపిణీ చేశామన్నారు. ఎన్టీఆర్ వైద్యసేవ నెట్వర్క్ ఆసుపత్రుల్లో చిన్నారులు వైద్యం పొందవచ్చన్నారు.
News December 8, 2025
GNT: PGRSలో ప్రజల ఫిర్యాదులు స్వీకరించిన ఎస్పీ

గుంటూరు జిల్లా పోలీస్ కార్యాలయంలో జరిగిన PGRSలో SP వకుల్ జిందాల్ ఆర్థిక, కుటుంబ, మోసాలు, బెదిరింపులు, ఆక్రమణలు, మహిళలు-వృద్ధుల వంటి పలు ఫిర్యాదులను స్వీకరించారు. ఫిర్యాదులను ఆన్లైన్ ద్వారా సంబంధిత స్టేషన్లకు పంపి నిర్ణీత సమయంలో పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని ఎస్పీ తెలిపారు. వీల్చైర్లో ఉన్నవారి వరకు వెళ్లి ఫిర్యాదులు స్వీకరించగా, అర్జీలు రాయడంలో సహాయం కోసం ప్రత్యేక సిబ్బందిని నియమించారు.
News December 8, 2025
GNT: అత్యవసర సమయంలో సంజీవిని LOC..!

పేదలకు వైద్య సహాయం కోసం CMRF, ఎన్టీఆర్ వైద్య సేవ పథకాలు ఉపయోగపడుతుంటాయని తెలిసిందే. ఇవి కాక అత్యవసర సమయంలో ప్రజల ప్రాణాలు కాపాడేందుకు LOC (లెటర్ ఆఫ్ క్రెడిట్) అనే పథకం సంజీవినిలా పని చేస్తుందని చాలా మందికి తెలీదు. బ్రెయిన్ స్ట్రోక్, గుండె పోటు, కిడ్నీ ఫెయిల్యూర్, నవజాత శిశువుల అనారోగ్యం వంటి వాటికి అత్యవసర చికిత్స కోసం ప్రాణాపాయ పరిస్థితుల్లో ఆస్పత్రిలో ఉన్న సమయంలోనే బాధితులకు ఈ సాయం అందుతుంది.


