News June 30, 2024

జూలై 1న ప్రజా సమస్యల పరిష్కార వేదిక: కలెక్టర్ బాలాజీ

image

జూలై 1వ తేదీ సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఉదయం 10:30 గంటల నుంచి ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు, జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ ఆదివారం తెలిపారు. ప్రజల నుంచి అర్జీలు స్వయంగా స్వీకరిస్తానని అన్నారు. జిల్లా కేంద్రంతోపాటు అన్ని డివిజన్, మండల కేంద్రాల్లో ఈ కార్యక్రమం జరుగుతుందని, ప్రజలు ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవాలని కలెక్టర్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

Similar News

News November 11, 2024

మచిలీపట్నంలో నేడు ప్రజా సమస్యల పరిష్కార వేదిక 

image

మచిలీపట్నం కలెక్టరేట్ సమావేశం మందిరంలో సోమవారం ఉదయం 10:30 గంటల నుంచి ప్రజా సమస్యల పరిష్కార వేదిక (మీకోసం) కార్యక్రమం నిర్వహించనున్నట్లు కలెక్టర్ డీకే బాలాజీ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. ప్రజల నుంచి అర్జీలు స్వీకరించడం జరుగుతోందని, జిల్లా, మండల కేంద్రాల్లో, మునిసిపల్ కార్యాలయాల్లో కూడా మీకోసం కార్యక్రమం జరుగుతుందన్నారు. ప్రజలు ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవాలన్నారు.  

News November 10, 2024

కృష్ణా: ANU దూరవిద్య MBA, MCA ఎంట్రన్స్ ఫలితాల విడుదల

image

ANU దూరవిద్య కేంద్రంలో MBA, MCA కోర్సుల ప్రవేశాలకు ఈ నెల 9 నిర్వహించిన అర్హత పరీక్ష ఫలితాలను దూరవిద్య కేంద్రం డైరెక్టర్ వెంకటేశ్వర్లు, కో ఆర్డినేటర్ రామచంద్రన్ ఆదివారం విడుదల చేశారు. ఈ పరీక్షలకు 201 మంది దరఖాస్తు చేసుకోగా వారిలో 188 మంది పరీక్షకు హాజరయ్యారని, 184 మంది అర్హత సాధించారని చెప్పారు. అర్హత సాధించిన వారికి ఈ నెల 15లోగా ప్రవేశాలు కల్పిస్తామన్నారు.

News November 10, 2024

విజయవాడ: భవానీ దీక్షల మాలధారణ, విరమణ తేదిలివే!

image

ఇంద్రకీలాద్రిపై భవానీ దీక్షల కార్యక్రమ సన్నాహకాలపై శనివారం ఆలయ EO కేఎస్ రామారావు, CP రాజశేఖరబాబుతో సమావేశమయ్యారు. ఈ నెల 11- 15 వరకు భవానీ దీక్షల మాలధారణ, డిసెంబర్ 14న కలశజ్యోతి, డిసెంబర్ 21- 25 వరకు దీక్షల విరమణ జరుగుతాయని CP రాజశేఖరబాబు చెప్పారు. ఆయా కార్యక్రమాలను విజయవంతం చేసేలా, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా చేయాల్సిన ఏర్పాట్లపై ఈ సమావేశానికి హాజరైన అధికారులతో సీపీ చర్చించారు.