News January 26, 2025

జెండాను ఎగరవేసిన పార్వతీపురం ఎస్పీ 

image

పార్వతీపురం మన్యం జిల్లా ఎస్పీ కార్యాలయంలో 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలను ఆదివారం నిర్వహించారు. మువ్వన్నెల జెండాను ఎస్పీ ఎస్.వి మాధవ్ రెడ్డి ఆవిష్కరించారు. పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. ఎందరో వీరుల త్యాగఫలితంతో మనకు స్వాతంత్రం వచ్చిందని, ప్రపంచంలోనే అతిపెద్ద రాజ్యాంగం కలిగిన దేశం మనదని అన్నారు.

Similar News

News November 3, 2025

సికింద్రాబాద్: ఉజ్జయిని మహకాంళిని దర్శించుకున్న కలెక్టర్

image

కార్తీక మాసం రెండో సోమవారం కావడంతో సికింద్రాబాద్ శ్రీ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి దేవాలయాన్ని డీసీపీ రష్మిక పెరుమాళ్, జిల్లా కలెక్టర్ హరిచందన దర్శించుకున్నారు. ఆలయ మర్యాదలతో ఈవో మనోహర్ రెడ్డి, అర్చకులు కలెక్టర్‌కి ఘనంగా స్వాగతం పలికారు. అమ్మవారికి కలెక్టర్ ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం అద్దాల మండపం వద్ద దీపాలంకరణ కార్యక్రమంలో మహిళా భక్తులతో కలిసి దీపాలను వెలిగించారు.

News November 3, 2025

నాలాలపై రిటైనింగ్ వాల్ నిర్మాణానికి చర్యలు: మేయర్

image

ఆక్రమణలకు గురైన నాలా ప్రాంతాల్లో శాశ్వత ప్రాతిపదికన రిటైనింగ్ వాల్ నిర్మాణాలను చేపట్టాలని మేయర్ గుండు సుధారాణి అధికారులను ఆదేశించారు. HNK పరిధిలోని వరద ముంపునకు గురైన ప్రాంతాలలో కమిషనర్ చాహత్ బాజ్‌పాయితో కలిసి మేయర్ క్షేత్రస్థాయిలో పర్యటించారు. నిర్మాణ పనులను సమర్థవంతంగా చేపట్టేందుకు సూచనలు చేశారు. వరద ముంపునకు గురైన గృహాల వాస్తవ సమాచారాన్ని పక్కాగా నమోదు చేయాలని అధికారులకు మేయర్ స్పష్టం చేశారు.

News November 3, 2025

పెడపల్లి: రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి

image

పుట్టపర్తి మండలం పెడపల్లి వద్ద సోమవారం చోటుచేసుకున్న రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. స్థానికుల వివరాల మేరకు.. బైక్‌పై వస్తున్న ఇద్దరు వ్యక్తులను కారు ఢీ కొట్టింది. ఈ ఘటనలో మహేష్ అక్కడికక్కడే మృతి చెందాడు. గాయపడ్డ రంగాను ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందాడు. వారిని ఢీ కొన్న కారు ధర్మవరం వైపు వెళ్లింది. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.