News January 20, 2025
జెస్సీ రాజ్‌కు కలెక్టర్ అభినందనలు

ప్రపంచ స్కేటింగ్ పోటీల్లో విజయం సాధించి రాష్ట్రపతి చేతుల మీదుగా ప్రధాన మంత్రి రాష్ట్రీయ బాల పురస్కారం అందుకున్న గుంటూరు జిల్లాకి చెందిన జెస్సీరాజ్‌ను కలెక్టర్ నాగలక్ష్మీ అభినందించారు. సోమవారం కలెక్టరేట్‌లో జెస్సీరాజ్‌ను సన్మానించిన ఆమె, భవిష్యత్తులో మరిన్ని విజయాలను సాధించి గుంటూరు ఖ్యాతిని పెంపొందించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో డీఎస్‌డీవో నరసింహారెడ్డి పాల్గొన్నారు.
Similar News
News February 23, 2026
గుంటూరు SP PGRSకు 215 ఫిర్యాదులు

గుంటూరులోని పోలీస్ ప్రధాన కార్యాలయంలో సోమవారం నిర్వహించిన PGRSకు 215 ఫిర్యాదులు అందినట్లు ఎస్పీ వకుల్ జిందాల్ తెలిపారు. కుటుంబ వివాదాలు, ఆస్తి, భూ తగాదాలు, రుణ, ఆర్థిక సమస్యలు, మోసపూరిత కేసులు, వ్యక్తిగత, సామాజిక సమస్యలకు సంబంధించిన ఫిర్యాదులు అధికంగా వచ్చాయన్నారు. ఫిర్యాదులను సమగ్రంగా విచారించి చట్టపరంగా గడువులోగా పరిష్కరించాలని ఆయా శాఖల అధికారులను ఆదేశించారు.
News February 23, 2026
గుంటూరు జిల్లాలో ఇంటర్ పరీక్షల సందడి

గుంటూరు జిల్లా వ్యాప్తంగా మరికాసేపట్లో ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. మొత్తం 68,898 మంది విద్యార్థులు హాజరవుతుండగా, వారి కోసం అధికారులు 87 పరీక్షా కేంద్రాలను సర్వం సిద్ధం చేశారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు జరగనున్నాయి. అధికారులు అన్ని కేంద్రాల వద్ద గట్టి నిఘా ఏర్పాటు చేశారు.
News February 23, 2026
నేడు గుంటూరు కలెక్టరేట్‌లో PGRS: కలెక్టర్

గుంటూరు కలెక్టరేట్‌లో సోమవారం PGRS, రెవెన్యూ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాట్లు కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా తెలిపారు. https://Meekosam.ap.gov.inసైట్‌లో అర్జీలు సమర్పించవచ్చన్నారు. 1100 టోల్ ఫ్రీ ద్వారా అర్జీల స్థితిని తెలుసుకొవచ్చని సూచించారు. రెవెన్యూ సమస్యల పరిష్కారం కోసం 4 రెవెన్యూక్లీనిక్‌లు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.


