News October 4, 2024

జె. పంగులూరు: నీటి కుంటలో పడి అన్నదమ్ములు మృతి

image

బాపట్ల జిల్లా జె. పంగులూరు మండలం బోదవాడలో ప్రమాదవశాత్తు నీటి కుంటలో పడి చిన్నారులు మృతి చెందిన సంఘటన శుక్రవారం సాయంత్రం జరిగింది. దసరా సెలవులకు తాత గారి ఊరు వచ్చిన చిన్నారులు సాయంత్రం ఆడుకుంటూ ఇంటి వెనక ఉన్న నీటి కుంటలో పడి మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. ఈ ఘటనలో కందుల బ్రహ్మారెడ్డి (8), కందుల సిద్ధార్థ రెడ్డి (6) మృతి చెందారు. పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు.

Similar News

News November 9, 2025

‘మీ కోసం’ రద్దు: కలెక్టర్

image

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈనెల 11న జిల్లాకు రానున్నారు. ఈ నేపథ్యంలో ఈనెల 10న సోమవారం ఒంగోలు కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించాల్సిన ‘మీ కోసం’ కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు కలెక్టర్ రాజాబాబు శనివారం తెలిపారు. ప్రజలు ఈ విషయాన్ని గమనించాలన్నారు. దూర ప్రాంతాల నుంచి ఎవరూ అర్జీలు అందించేందుకు జిల్లా కేంద్రానికి రావద్దని సూచించారు.

News November 9, 2025

మత్స్యకారులకు రూ.72 లక్షలు పరిహారం: దామచర్ల సత్య

image

మంగళగిరిలోని మారిటైమ్ బోర్డు కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన సమీక్షా సమావేశానికి దామచర్ల సత్య హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ.. గత సమావేశంలో చర్చకు వచ్చిన అంశాల పురోగతిని అధికారులు వివరించారన్నారు. మొంథా సైక్లోన్ సమయంలో ఉప్పాడలో నష్టపోయిన మత్స్యకారులను ఆదుకునేందుకు 26 బోట్లకు అందించిన రూ.72 లక్షల నష్టపరిహారానికి మారిటైం బోర్డు ఆమోదించిందన్నారు. మంత్రి జనార్దన్ రెడ్డి ఉన్నారు.

News November 9, 2025

10న ‘మీ కోసం’ రద్దు: ఎస్పీ

image

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈనెల 11న జిల్లాకు రానున్నారు. ఈక్రమంలో ఈనెల 10న జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించనున్న ‘మీ కోసం’ కార్యక్రమాన్ని తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు ఎస్పీ వి.హర్షవర్ధన్ రాజు శనివారం తెలిపారు. ప్రజలు ఈ విషయాన్ని గమనించాలన్నారు. దూర ప్రాంతాల నుంచి ఎవరూ ‘మీ కోసం’ కార్యక్రమానికి రావద్దని సూచించారు.