News February 14, 2025
జేఈఈలో నేహలతకు 93.22 పర్సంటైల్

నల్గొండ జిల్లా తిప్పర్తి మండలం రాజుపేటకు చెందిన బైరోజు బ్రహ్మచారి-కల్యాణి దంపతుల కుమార్తె నేహలత ఇటీవల విడుదలైన జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో 93.22 పర్సంటైల్ సాధించింది. నేహలత గౌలిదొడ్డిలొని సాంఘిక సంక్షేమ గురుకులంలో ఇంటర్ రెండో సంవత్సరం చదువుతోంది. సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఎస్సీ డీడీ ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీధర్, గురుకుల కార్యదర్శి వర్షిణి, ప్రిన్సిపల్ కల్పన అభినందించారు.
Similar News
News November 16, 2025
మేడారంలో అభివృద్ధి పనుల పరిశీలన: మంత్రి సీతక్క

మేడారంలో మాస్టర్ ప్లాన్ మేరకు జరుగుతున్న అభివృద్ధి పనులను మంత్రి సీతక్క, కలెక్టర్ దివాకర్ తదితరులతో కలిసి ఆదివారం పరిశీలించారు. జంపన్న వాగు వద్ద భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. వాగు మెట్లను పరిశుభ్రంగా ఉంచాలని సూచించారు. భద్రతా చర్యల్లో భాగంగా జంపన్న వాగు వంతెనపై జాలి (రక్షణ కంచె) ఏర్పాటు చేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు.
News November 16, 2025
తిరుపతి: విద్యుత్ సమస్యలు ఉంటే కాల్ చేయండి.!

విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కారం కోసం డయల్ యువర్ CMD కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు CMD శివశంకర్ తెలిపారు. సోమవారం ఉదయం 10-12 మధ్య కార్యక్రమం ఉంటుందన్నారు. రాయలసీమ జిల్లాల ప్రజలు సమస్యలు ఉంటే 8977716661కు కాల్ చేయవచ్చని ఆయన స్పష్టం చేశారు. వీటితోపాటు 1912, వాట్సాప్ నం. 91333 31912 ద్వారా ఫిర్యాదు చేయవచ్చన్నారు.
News November 16, 2025
కొమురవెల్లి: మల్లన్న కళ్యాణం, జాతర ఏర్పాట్లపై కలెక్టర్ సమీక్ష

కొమురవెల్లి శ్రీమల్లికార్జున స్వామి వారి కళ్యాణం, జాతర బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై ఆదివారం కలెక్టర్ హైమావతి సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. శ్రీ మల్లికార్జున స్వామి దేవస్థానం కొమురవెల్లిలో 14 డిసెంబర్ నుంచి 16 మార్చి 2026 వరకు జరిగే కార్యక్రమాలకు పటిష్ట ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు.


