News February 12, 2025

జేఈఈ మెయిన్‌లో బాన్సువాడ విద్యార్థి ప్రతిభ 

image

కామారెడ్డి జిల్లా బాన్సువాడ మున్సిపాలిటీ పరిధిలోని సంగమేశ్వర కాలనీకి చెందిన అభినయ్ ఇటీవల ప్రకటించిన జేఈఈ మెయిన్ ఫలితాల్లో 99.84 శాతం సాధించి అత్యుత్తమ ప్రతిభకనబరిచారు. ఈ సందర్భంగా బుధవారం విద్యార్థికి కాలనీవాసులు అభినందనలు తెలిపారు. అభినయ్ మాట్లాడుతూ.. ఈ ప్రతిభ కనబర్చడానికి చాలా కష్టపడ్డానన్నారు.

Similar News

News October 25, 2025

వరంగల్: కేంద్రాలు కరవాయే.. దళారులదే రాజ్యమాయే!

image

ఆరుగాలం శ్రమించిన మొక్కజొన్న రైతు నష్టాల పాలవుతున్నారు. సకాలంలో పంట చేతికొచ్చినా అకాల వర్షాలతో కల్లాల్లో తడిసి ముద్దవుతున్నాయి. మార్క్ ఫెడ్ ఆధ్వర్యంలో కేంద్రాలు ఏర్పాటు చేయాల్సి ఉన్నప్పటికీ నేటికీ ఏర్పాటు చేయకపోవడంతో రైతన్నలు దళారులను ఆశ్రయిస్తున్నారు. అకాల వర్షాల కారణంగా రూ.1600 నుంచి రూ.1800లకే దళారులకు విక్రయిస్తూ ఉమ్మడి వరంగల్ రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు.

News October 25, 2025

HNR: జాబ్‌మేళాను ప్రారంభించనున్న మంత్రి శ్రీధర్ బాబు

image

మంత్రి ఉత్తమ్‌ ఆధ్వర్యంలో హుజూర్‌నగర్‌లో శని, ఆదివారాల్లో నిరుద్యోగ యువత కోసం మెగా జాబ్‌మేళా జరగనుంది. నేడు హుజూర్‌నగర్‌లోని పెరల్ ఇన్ఫినిటీ ఇంటర్నేషనల్ స్కూల్‌లో మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు చేతుల మీదుగా ఈ జాబ్‌మేళా ప్రారంభం కానుంది. ఉమ్మడి నల్గొండ జిల్లా యువతకు ఉద్యోగాలు కల్పించడమే లక్ష్యంగా ఈ మేళా నిర్వహిస్తున్నారు.

News October 25, 2025

VZM: ఒకేచోట ఆధ్యాత్మికత.. పర్యాటకం

image

విజయనగరం మండలం సారిక గ్రామంలోని కాళీమాత దేవాలయం, రామబాణం ఆకారంలో ఉన్న రామనారాయణం దేవాలయం పక్కనే ఉండటంతో ఆధ్యాత్మిక సందర్శకుల కేంద్రంగా మారింది. కార్తీక మాసంలో భక్తులు ఒకేసారి రెండు పుణ్య క్షేత్రాలను దర్శించుకునే అరుదైన అవకాశం లభిస్తోంది. దీంతో ఈ ప్రాంతం ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా విరాజిల్లుతోంది. భక్తులు కాళీమాత ఆశీస్సులు, శ్రీరామచంద్రుడి కృప ఒకే చోట పొందుతున్నారు.