News February 12, 2025

జేఈఈ మెయిన్‌లో బాన్సువాడ విద్యార్థి ప్రతిభ 

image

కామారెడ్డి జిల్లా బాన్సువాడ మున్సిపాలిటీ పరిధిలోని సంగమేశ్వర కాలనీకి చెందిన అభినయ్ ఇటీవల ప్రకటించిన జేఈఈ మెయిన్ ఫలితాల్లో 99.84 శాతం సాధించి అత్యుత్తమ ప్రతిభకనబరిచారు. ఈ సందర్భంగా బుధవారం విద్యార్థికి కాలనీవాసులు అభినందనలు తెలిపారు. అభినయ్ మాట్లాడుతూ.. ఈ ప్రతిభ కనబర్చడానికి చాలా కష్టపడ్డానన్నారు.

Similar News

News March 25, 2025

మహిళలకు తగ్గిన లీడర్‌షిప్ పొజిషన్లు: టీమ్‌లీజ్

image

హయ్యర్ లీడర్‌షిప్ స్థాయుల్లో మహిళల ప్రాతినిధ్యం సగటున 19%కి తగ్గినట్టు టీమ్‌లీజ్ రిపోర్టు తెలిపింది. ఎంట్రీ లెవల్ పొజిషన్లలో 46% ఉన్నట్టు పేర్కొంది. ఇక వారి నిరుద్యోగ రేటు 2.9 నుంచి 3.2%కి పెరిగిందని వెల్లడించింది. పట్టణాలతో పోలిస్తే గ్రామీణ ప్రాంతాల్లో స్త్రీల వర్క్ ఫోర్స్ పార్టిసిపేషన్ బాగుందంది. కన్జూమర్ సర్వీసెస్, రిటైల్, విద్య వంటి రంగాల్లో వారికి సీ-సూట్ పొజిషన్లు ఎక్కువగా దక్కుతున్నాయి.

News March 25, 2025

హైడ్రా, జీహెచ్ఎంసీ కమిషనర్ల కీలక నిర్ణయం

image

TG: హైడ్రా, జీహెచ్‌ఎంసీ కమిషనర్లు కీలక నిర్ణయం తీసుకున్నారు. అగ్నిప్రమాదాలు, వరద ముంపు నివారణకు రెండు ప్రత్యేక కమిటీలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. దీంతో పాటు చెరువుల సంరక్షణ, సుందరీకరణ, పునరుద్ధరణపై చర్చించారు.

News March 25, 2025

50వేల మంది విద్యార్థులకు ‘సిస్కో’ శిక్షణ: లోకేశ్

image

AP: ఉన్నత, వృత్తి విద్య అభ్యసిస్తున్న విద్యార్థుల్లో నైపుణ్యాలను పెంచేందుకు IT సంస్థ సిస్కోతో ఒప్పందం చేసుకున్నట్లు మంత్రి లోకేశ్ వెల్లడించారు. ‘నెట్‌వర్కింగ్, సైబర్ సెక్యూరిటీ, AI వంటి రంగాల్లో అత్యాధునిక కంటెంట్‌ను సిస్కో అందిస్తుంది. ఈ MoUతో 50K మందికి ఆ సంస్థ శిక్షణ ఇస్తుంది. మానవ వనరులకు పెరుగుతున్న డిమాండ్‌కు అనుగుణంగా నైపుణ్యాలను పెంచి, ఉపాధిని పెంపొందించడమే లక్ష్యం’ అని ట్వీట్ చేశారు.

error: Content is protected !!