News February 12, 2025

జేఈఈ మెయిన్స్‌లో మెరిసిన ఖేడ్ విద్యార్థి

image

మంగళవారం విడుదలైన జేఈఈ మెయిన్స్- 2025 ఫలితాల్లో సంగారెడ్డి జిల్లా యువకుడు సత్తా చాటాడు. నారాయణఖేడ్ ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థి మెగావత్ పరశురాం జేఈఈ ఎంట్రెన్స్ ఎగ్జామినేషన్‌లో NTA స్కోర్ 74.6724856 సాధించాడని కళాశాల ప్రిన్సిపల్ ఉమా మహేష్ తెలిపారు. దీంతో పరశురాంను అధ్యాపకులు, తల్లిదండ్రులు, స్నేహితులు అభినందించారు.

Similar News

News November 26, 2025

విశాఖలో ఆత్మహత్య చేసుకున్న అల్లూరి విద్యార్థిని

image

అల్లూరి జిల్లా విద్యార్థిని విశాఖపట్నంలో బుధవారం ఆత్మహత్య చేసుకుంది. హుకుంపేట మండలం రాప గ్రామానికి చెందిన శోభ నందిని (19) కృష్ణా కాలేజీలో బీఎస్సీ ఫైనల్ ఇయర్ చదువుతోంది. మద్దిలపాలెంలో అద్దెకు ఉంటున్న ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ మేరకు పోలీసులు నందని కుటుంబ సభ్యులుకు సమాచారం తెలియజేశారు. మృతురాలి సెల్ ఫోన్ స్వాధీనం చేసుకొని పోలీసులు విచారణ చేస్తున్నారు.

News November 26, 2025

మంచిర్యాల: నామినేషన్ ప్రక్రియ సజావుగా నిర్వహించాలి

image

రాష్ట్రంలో 2వ సాధారణ పంచాయితీ ఎన్నికల నిర్వహణలో నామినేషన్ ప్రక్రియ సజావుగా నిర్వహించాలని జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. జిల్లా కార్యాలయంలో శిక్షణ కార్యక్రమానికి హాజరయ్యారు. నామినేషన్ ప్రక్రియ నుంచి ఎన్నికల ఫలితాలు ప్రకటించే వరకు ఎన్నికల నోటిఫికేషన్, నామినేషన్ల పరిశీలన, పోటీలో ఉండే అభ్యర్థుల తుది జాబితా, ఫలితాలు వంటి ప్రతి అంశంపై అప్రమత్తంగా ఉండాలన్నారు.

News November 26, 2025

HYD: డీజీపీ ఆఫీస్‌లో రాజ్యాంగ దినోత్సవం

image

తెలంగాణ డీజీపీ కార్యాలయంలో రాజ్యాంగ దినోత్సవాన్ని పోలీసు ఉన్నతాధికారులతో కలిసి ఘనంగా నిర్వహించారు. అదనపు డీజీపీ మహేశ్ భగవత్, డీఎస్ చౌహన్‌తో పాటు పలువురు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాజ్యాంగ ప్రవేశికను పఠిస్తూ, రాజ్యాంగ స్ఫూర్తిని కాపాడాలని పోలీసులు ప్రతి ఒక్కరు ప్రతిజ్ఞ చేశారు.