News February 17, 2026

జేఈఈ మెయిన్స్‌లో ‘హార్వెస్ట్‌’ విద్యార్థుల ప్రభంజనం

image

JEE మెయిన్స్‌ మొదటి విడత ఫలితాల్లో హార్వెస్ట్‌ కాలేజీ విద్యార్థులు సత్తాచాటారు. కళాశాల నుంచి 250 మంది హాజరుకాగా.. కృష్ణ మనోహర్‌ 99.87%, అన్వితా రెడ్డి 99.47%, లోకేష్‌ 99.42%, స్ఫూర్తి 99.31%, సాయిచరణ్‌ 99.04% పర్సంటైల్‌ సాధించారు. మరో 30 మంది 90% పైగా మార్కులు పొందారు. అనుభవజ్ఞులైన అధ్యాపకుల వల్లే ఈ ఫలితాలు వచ్చాయని కరస్పాండెంట్‌ రవికుమార్‌, ప్రిన్సిపల్‌ పార్వతి రెడ్డి విద్యార్థులను అభినందించారు.

Similar News

News March 17, 2026

సంగారెడ్డి: డిజిటల్ హెల్త్ కార్డులపై కలెక్టర్ యాక్షన్ ప్లాన్

image

సంగారెడ్డి జిల్లాలో డిజిటల్ హెల్త్ కార్డుల అమలుకు సమగ్ర ప్రణాళిక రూపొందించాలని కలెక్టర్ ప్రావీణ్య ఆదేశించారు. మంగళవారం క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. ప్రజలకు వేగవంతమైన, పారదర్శకమైన వైద్య సేవలు అందించడమే లక్ష్యమని తెలిపారు. ప్రతి ఒక్కరి ఆరోగ్య సమాచారం డిజిటలైజ్ కావాలని సూచించారు. అదనపు కలెక్టర్ పాండు, జిల్లా వైద్యాధికారి డాక్టర్ వసంత రావు తదితరులు పాల్గొన్నారు.

News March 17, 2026

కడప: రేపటి నుంచి ప్రత్యేక అధికారుల పాలన ప్రారంభం

image

కడప జిల్లాలోని మున్సిపాలిటీలు, నగరపాలక సంస్థ పాలకవర్గ సభ్యుల పదవీకాలం మంగళవారంతో ముగిసింది. బుధవారం నుంచి ప్రత్యేక అధికారుల పాలనలో నగరపాలక సంస్థ, మున్సిపాలిటీలు కొనసాగనున్నాయి. కడప నగర పాలక సంస్థ ప్రత్యేక అధికారిగా జిల్లా కలెక్టర్ చెరుకూరి శ్రీధర్, ప్రొద్దుటూరు మున్సిపాలిటీకి ప్రత్యేక అధికారిగా జిల్లా జేసీ నిధి మీనా బాధ్యతలు చేపట్టనున్నారు.

News March 17, 2026

IPL తొలి మ్యాచులకు హేజిల్‌వుడ్, కమిన్స్ దూరం!

image

IPL-2026 ప్రారంభంలో కొన్ని మ్యాచులకు AUS ప్లేయర్లు హేజిల్‌వుడ్, కమిన్స్ దూరం కానున్నట్లు తెలుస్తోంది. RCBకి ప్రాతినిధ్యం వహిస్తున్న హేజిల్‌వుడ్ తొలి 2 మ్యాచులు ఆడకపోవచ్చని Cricbuzz పేర్కొంది. అటు SRH కెప్టెన్ కమిన్స్ కూడా IPLలో లేట్‌గా ఎంట్రీ ఇవ్వొచ్చని తెలిపింది. వీరిద్దరూ గాయాల కారణంగా కొన్ని నెలలుగా క్రికెట్‌కు దూరమైన సంగతి తెలిసిందే. కాగా ఈనెల 28న జరిగే ఓపెనింగ్ మ్యాచులో RCB, SRH తలపడనున్నాయి.