News October 30, 2024
జేఎన్టీయూ, అంబేద్కర్ యూనివర్సిటీ వీసీలొచ్చేదెప్పుడు?

విద్యాశాఖ పరిధిలో మొత్తం 12 యూనివర్సిటీలుండగా 9 యూనివర్సిటీలకు వైస్ ఛాన్సలర్లను ఇటీవల ప్రభుత్వం నియమించింది. ఇంకా 3 యూనివర్సిటీలకు వీసీలను నియమించకుండా పెండింగ్లోనే పెట్టింది. ఈ మూడింటిలో JNTU, అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ, ఫైన్ఆర్ట్స్ యూనివర్సిటీలున్నాయి. వీసీల ఎంపికలో ఒకే సామాజిక వర్గానికి చెందినవే వచ్చినట్లు తెలిసింది. వీసీలు లేక పరిపాలన కుంటుపడిందని పలు విద్యార్థి సంఘాలు ఆరోపిస్తున్నాయి.
Similar News
News December 4, 2025
HYD: పెరుగుతున్న కేసులు.. జాగ్రత్త!

HYDలో బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ చికిత్సలు దాదాపు పదికిపైగా ఆస్పత్రులు అందిస్తున్నాయి. అయితే.. నెలకు 200 మంది వరకు ఈ ట్రాన్స్ప్లాంటేషన్ చేసుకుంటున్నట్లు MNJ వైద్యులు గుర్తించారు. ఇన్ఫెక్షన్లు, ల్యూకేమియా, ఇన్ఫోమా, మైలోమా వంటి బ్లడ్ క్యాన్సర్లకు బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ పరిష్కారమని చెబుతున్నారు. ఊబకాయులు, పెరగుతున్న వయసు, పురుషుల్లో అధికంగా దీని లక్షణాలు కనిపిస్తున్నట్లు తేల్చారు.
News December 4, 2025
HYD: చెస్ ఆడతారా.. ₹22లక్షలు గెలుచుకోవచ్చు

తెలంగాణలో తొలి అతిపెద్ద ప్రైజ్మనీ చెస్ టోర్నమెంట్ డిసెంబర్ 20, 21 తేదీల్లో హిటెక్స్లో జరుగనుంది. ఎక్కారా చెస్ అకాడమీ నిర్వహిస్తున్న ఈ ఓపెన్ ర్యాపిడ్ టోర్నమెంట్లో గెలుపొందితే ₹22.22 లక్షలు ప్రైజ్ మనీ సొంత చేసుకోవచ్చు. రాష్ట్రంలో భారీ స్థాయిలో జరుగుతున్న మొదటి చెస్ టోర్నీ అని నిర్వాహకులు తెలిపారు. SHARE IT
News December 4, 2025
The ‘Great’ హైదరాబాద్

విలీనంతో HYD దేశంలోనే అతిపెద్ద నగరంగా అవతరించింది. విలీనం అనంతరం బల్దియా స్థితి గతులను పరిశీలిస్తే..
GHMC విస్తీర్ణం: 2735 చదరపు కిలో మీటర్లు
జనాభా: దాదాపు కోటిన్నర
మేయర్, 149 మంది కార్పొరేటర్లు+300 డివిజన్లకు ఆస్కారం
కమిషనర్, 10 మంది అదనపు కమిషన్లర్లు
23 మంది MLAలు+కొత్తగా ఇద్దరు MLAలు?
6 జోన్లు+ఆరుగురు జోనల్ కమిషనర్లు
57 సర్కిళ్లు+57మంది డిప్యూటీ కమిషనర్లు


