News July 4, 2024
జేఎన్టీయూ పరిధిలో 8 ఇంజనీరింగ్ కళాశాలలో సీట్లు కోత
జవహర్ లాల్ నెహ్రూ టెక్నాలజీ యూనివర్సిటీ పరిధిలో 8 ఇంజనీరింగ్ కళాశాలలో నాణ్యత ప్రమాణాలు సరిగా లేవని అధికారులు సీట్ల కోత విధించారు. అనంత జిల్లాలో రెండు, చిత్తూరులో ఒకటి, నెల్లూరులో రెండు, కడపలో 1, అన్నమయ్య జిల్లాలో రెండు ఇంజనీరింగ్ కళాశాల ఉన్నట్లు తెలిపారు. నాలుగు ఇంజనీరింగ్ కళాశాలలో అడ్మిషన్లు తీసుకోవద్దని సూచించారు. మొత్తం మీద 66 ఇంజనీరింగ్ కళాశాలలకు జేఎన్టీయూ అనుమతి ఇచ్చింది.
Similar News
News October 6, 2024
రేపు JNTUలో MBA, MCA స్పాట్ అడ్మిషన్లు
అనంతపురం జేఎన్టీయూలో MBA, MCA స్పాట్ అడ్మిషన్లు నిర్వహిస్తున్నట్లు డైరెక్టర్ ఆఫ్ అడ్మిషన్స్ ప్రొఫెసర్ కిరణ్మయి ఒక ప్రకటనలో తెలిపారు. దీనికి సంబంధించి MBAలో 9 సీట్లు, MCAలో 4 సీట్లు ఉన్నట్లు తెలిపారు. ఆసక్తి గల విద్యార్థులు యూనివర్సిటీలోని పరిపాలన భవనం నందు సోమవారం ఉదయం 9.00 గంటలకు తమ ఒరిజినల్ సర్టిఫికెట్లతో హాజరుకావాలని సూచించారు.
News October 6, 2024
గుర్తుతెలియని వ్యక్తి ఆత్మహత్య
హిందూపురం మండలం దేవరపల్లి రైల్వే స్టేషన్ సమీపంలో గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందినట్లు ఆదివారం ఉదయం పోలీసులు గుర్తించారు. ఆయన వయస్సు 35 నుంచి 40 ఏళ్ల మధ్య ఉన్నట్లు తెలిపారు. విషం తాగి మృతి ఆత్మహత్య చేసుకున్నట్లు భావిస్తున్నారు. మృతుడి సమాచారం తెలిస్తే హిందూపురం రూరల్ పోలీస్ స్టేషన్‌లో తెలపాలని కోరారు.
News October 6, 2024
ఉచిత ఇసుక రవాణాకు పటిష్ట చర్యలు:
ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలో పారదర్శకంగా ఉచిత ఇసుక సరఫరాను పటిష్టంగా అమలు చేస్తున్నట్టు శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టర్ టీఎస్ చేతన్ పేర్కొన్నారు. శనివారం రాత్రి కార్యాలయంలో జాయింట్ కలెక్టర్ అభిషేక్ కుమార్, ఎస్పీ రత్న కలిసి భూగర్భ ఘనుల శాఖ ముఖ్య కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా తో వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు. జిల్లాలో ఇసుక రీచ్‌లు, తవ్వకాలు, బుకింగ్, అమ్మకాలపై కలెక్టర్ వివరించారు.