News September 1, 2024
జేఎన్టీయూ యూనివర్సిటీ పరీక్షలు వాయిదా

జేఎన్టీయూ యూనివర్సిటీ పరిధిలో రేపు జరగబోయే అన్ని పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు యూనివర్సిటీ రిజిస్ట్రార్ వెంకటేశ్వరరావు తెలిపారు. భారీ వర్షాల నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యా సంస్థలకు సెలవు ప్రకటించిన నేపథ్యంలో రేపు జరగాల్సిన ఎంబీఏ, బీటెక్ సప్లిమెంటరీ పరీక్షలన్నీ వాయిదా వేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. వాయిదా పడిన పరీక్షలను 5వ తేదీన మళ్లీ నిర్వహిస్తామని ఆయన తెలియజేశారు.
Similar News
News December 30, 2025
BIG BREAKING: మే నెలలో GHMC ఎన్నికలు?

TGలో మున్సిపల్ ఎన్నికల సందడి మొదలైంది. ఇప్పటికే ఎన్నికల కమిషనర్ గిరిధర్ సుందర్ బాబు 117 మున్సిపాలిటీల కమిషనర్లతో నిర్వహించిన VCలో కీలక ఆదేశాలు జారీ చేశారు. వచ్చే ఫిబ్రవరిలోనే మున్సిపాలిటీలు, కార్పొరేషన్లకు ఎన్నికలు ఉంటాయి. ఇదే సమయంలో GHMC పాలకవర్గం ముగియనుంది. దీంతో వెంటనే మే నెలలో GHMC ఎన్నికలు కూడా నిర్వహించే అవకాశం ఉంది.
SHARE IT
News December 30, 2025
HYD: టూర్ ఇప్పుడెందుకు బాస్?

పదవి ఊడే టైంలో పిక్నిక్ ఏంటి సామీ.. FEBతో కాలపరిమితి ముగిసే GHMC కార్పొరేటర్లు ఇప్పుడు సడన్‌గా FEB 4th నుంచి 9th వరకు Study Tour చేస్తున్నారు. వీళ్లు వెళ్లి వచ్చేసరికి పదవి ఉండదు.. నేర్చుకున్నది అమలు చేసే టైమూ ఉండదు. మరి రూ.కోట్లాది ప్రజాధనం వృథా ఎవరి కోసం?. రిటైర్ అయ్యే ఉద్యోగులను కూడా ట్రైనింగ్‌కి పంపొద్దనే రూల్ ఉంది. ఈ ‘బైబై టూర్ల’కు బ్రేక్ వేయాలని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ సర్కారును కోరింది.
News December 30, 2025
NEW YEAR: అర్ధరాత్రి ఒంటిగంట వరకు మెట్రో

న్యూ ఇయర్ వేళ నగరవాసులకు మెట్రో గుడ్ న్యూస్ చెప్పింది. సాధారణంగా రాత్రి 11 గంటల వరకు చివరి రైలు సేవలు అందుబాటులో ఉన్నాయి. రేపు 31ST నైట్ ఈవెంట్ల నేపథ్యంలో అర్ధరాత్రి కూడా మెట్రో రైల్ సేవలు అందించనుంది. జనవరి 1న అర్ధరాత్రి ఒంటి గంటకు చివరి రైలు ఉంటుంది. ఈ న్యూ ఇయర్‌కి జర్నీ స్ట్రెస్ లేకుండా సెలబ్రేషన్ చేసుకోవాలని మెట్రో అధికారులు సూచించారు.
SHARE IT


