News September 1, 2024

జేఎన్టీయూ యూనివర్సిటీ పరీక్షలు వాయిదా

image

జేఎన్టీయూ యూనివర్సిటీ పరిధిలో రేపు జరగబోయే అన్ని పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు యూనివర్సిటీ రిజిస్ట్రార్ వెంకటేశ్వరరావు తెలిపారు. భారీ వర్షాల నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యా సంస్థలకు సెలవు ప్రకటించిన నేపథ్యంలో రేపు జరగాల్సిన ఎంబీఏ, బీటెక్ సప్లిమెంటరీ పరీక్షలన్నీ వాయిదా వేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. వాయిదా పడిన పరీక్షలను 5వ తేదీన మళ్లీ నిర్వహిస్తామని ఆయన తెలియజేశారు.

Similar News

News September 12, 2024

గణేశ్ నిమజ్జనం: HYDలో ‘రేపటి కోసం’

image

వినాయకచవితి ఉత్సవాల్లో భాగంగా నిమజ్జనం కోసం హైదరాబాద్‌లో ఏర్పాట్లు‌ జరుగుతున్నాయి. మండపాల్లో విగ్రహాలను నిలబెట్టిన భక్తులు ‘రేపటి కోసం’ అనే నినాదంతో ముందుకు వెళ్తున్నారు. ‘నిమజ్జనం ఉంది. విరాళాలు కావాలి. సొంత డబ్బులు పోగు చేయాలి. అన్నదానం కోసం దాతల సహాయం కావాలి. మన గణపతిని అంగరంగ వైభవంగా ఊరేగించాలి’ అన్న తపనతో యువత‌ ముందుకు కదులుతున్నారు. మరి మీ మండపం‌ వద్ద పరిస్థితి ఎలా ఉంది. కామెంట్ చేయండి.

News September 12, 2024

HYD: సెప్టెంబర్ 17..ముఖ్య అతిథులు వీరే..!

image

రాష్ట్రంలో సెప్టెంబర్ 17ను తెలంగాణ ప్రజాపాలన దినోత్సవంగా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. HYD జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి, RR జిల్లాలో స్టేట్ చీఫ్ అడ్వైజర్ వేం నరేందర్ రెడ్డి, మేడ్చల్ జిల్లాలో ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి, వికారాబాద్ జిల్లాలో స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ముఖ్య అతిథులుగా పాల్గొని తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం నిర్వహిస్తారని ప్రభుత్వం తెలిపింది.

News September 11, 2024

HYD: మెట్రో ప్రయాణికుల కొత్త డిమాండ్

image

హైదరాబాద్‌ మెట్రో‌లో రద్దీ రోజురోజుకి పెరుగుతోంది. ముఖ్యంగా నాగోల్ నుంచి రాయదుర్గం రూట్‌లో ఉదయం, సాయంత్రం నిలబడలేని పరిస్థితి ఉంటోంది. నాన్‌స్టాప్ సర్వీసులు ఏర్పాటు చేయాలని ప్రయాణికులు కోరుతున్నారు. దీనివలన ప్రయాణం సౌలభ్యంగా ఉంటుందని అభిప్రాయపడుతున్నారు. రెగ్యులర్ సేవలతో పాటు నాన్ స్టాప్ సర్వీసులు కూడా ఏర్పాటు చేయడంతో‌ సమయం ఆదా అవుతోందన్నారు. దీనిపై మీ కామెంట్?