News February 3, 2025

జేఎన్టీయూ వర్సిటీలో రీసెర్చ్ మెథడాలజీ

image

JNTU యూనివర్సిటీలో రీసెర్చ్ మెథడాలజీ అనే అంశంపై వారం రోజులు వర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ బాలకిష్టారెడ్డి ఆడిట్ కోర్సులు ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. సమాజ ప్రయోజనానికి తోడ్పడే పరిశోధనలు చేయాలని ప్రస్తుత యుగంలో మల్టీ డిసిప్లినరీ రీసెర్చ్ అవసరమని ఆయన పేర్కొన్నారు. ఫిబ్రవరి 8 వరకు కొనసాగుతాయి అన్నారు. వర్సిటీ రిజిస్ట్రార్ వెంకటేశ్వరరావుతో పాటు తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.

Similar News

News November 28, 2025

మ‌హాత్మా జ్యోతిరావ్ ఫూలేకు నివాళులర్పించిన విశాఖ కలెక్టర్

image

మ‌హాత్మా జ్యోతిరావ్ ఫూలే వ‌ర్ధంతిని పుర‌స్క‌రించుకొని శుక్ర‌వారం నౌరోజీ రోడ్డులోని ఆయన విగ్ర‌హానికి కలెక్టర్ ఎం.ఎన్.హ‌రేంధిర ప్ర‌సాద్ పూల‌మాల వేసి నివాళులర్పించారు. ఫూలే చేపట్టిన సామాజిక సంస్కరణలు, సేవలను గుర్తు చేసుకుంటూ నివాళులు అర్పించారు. ఫూలే అణగారిన కులాల అభ్యున్నతికి, స్త్రీ జనోద్ధరణకు విశేష సేవలు చేశారన్నారు.

News November 28, 2025

NGKL: ఎన్నికల అభ్యర్థులకు కొత్త బ్యాంకు ఖాతా తప్పనిసరి

image

గ్రామ పంచాయతీ ఎన్నికలలో సర్పంచ్, వార్డు స్థానాలకు పోటీ చేసే అభ్యర్థులు తప్పనిసరిగా కొత్తగా బ్యాంకు ఖాతాలు తెరవాలని అధికారులు శుక్రవారం ఆదేశాలు జారీ చేశారు. మొదటి విడత ఎన్నికలలో గడువు తక్కువగా ఉండటంతో పాత ఖాతాలను అనుమతించారు. అయితే, రెండో విడత ఎన్నికలలో పోటీ చేసే అభ్యర్థులు మాత్రం తప్పనిసరిగా కొత్త ఖాతాలు తెరవాల్సి ఉంటుందని అధికారులు స్పష్టం చేశారు.

News November 28, 2025

21 మందిని అరెస్టు చేసిన సైబర్ పోలీసులు

image

వివిధ ప్రాంతాల్లో సైబర్ నేరాలకు పాల్పడుతున్న వారిని సైబరాబాద్ సైబర్ క్రైం పోలీసులు 21 మందిని అరెస్టు చేశారు. వీరిలో 13 ట్రేడింగ్ ఫ్రాడ్స్, మిగతా వారిని డిజిటల్ అరెస్ట్ కేసులో అదుపులోకి తీసుకున్నారు. ఈ నెల 19 నుంచి 25వ తేదీ వరకు వీరిని అరెస్టు చేశారు. ఇదిలా ఉండగా దాదాపు 49 కేసుల్లో బాధితులకు రూ.89.7 లక్షలను తిరిగి ఇప్పించారు.