News February 3, 2025
జేఎన్టీయూ వర్సిటీలో రీసెర్చ్ మెథడాలజీ

JNTU యూనివర్సిటీలో రీసెర్చ్ మెథడాలజీ అనే అంశంపై వారం రోజులు వర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ బాలకిష్టారెడ్డి ఆడిట్ కోర్సులు ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. సమాజ ప్రయోజనానికి తోడ్పడే పరిశోధనలు చేయాలని ప్రస్తుత యుగంలో మల్టీ డిసిప్లినరీ రీసెర్చ్ అవసరమని ఆయన పేర్కొన్నారు. ఫిబ్రవరి 8 వరకు కొనసాగుతాయి అన్నారు. వర్సిటీ రిజిస్ట్రార్ వెంకటేశ్వరరావుతో పాటు తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.
Similar News
News April 14, 2026
DANGER: వేసవిలో ఇవి తింటే..

సమ్మర్‌లో అధిక నూనె ఉండే బజ్జీలు, పకోడీలు, చిప్స్, డీప్ ఫ్రైడ్ ఐటమ్స్‌కు దూరంగా ఉండాలని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. వీటి వల్ల అలసట, ఎసిడిటీ వస్తాయని, జీర్ణవ్యవస్థ దెబ్బతింటుందని తెలిపారు. అలాగే స్వీట్లు, ప్యాకేజ్డ్ జ్యూసులు, షుగర్ ఎక్కువగా ఉండే కూల్‌డ్రింక్స్ తాగొద్దని, వీటి వల్ల రోగనిరోధక శక్తి తగ్గుతుందని పేర్కొన్నారు. ప్రాసెస్ చేసిన, ప్యాకేజ్డ్ ఫుడ్స్ కూడా ఆరోగ్యానికి ప్రమాదకరమని సూచించారు.
News April 14, 2026
ఒంటిమిట్టలో 45 డిగ్రీల ఉష్ణోగ్రత

AP: కడప(D) ఒంటిమిట్టలో ఇవాళ 45°C ఉష్ణోగ్రత నమోదైంది. నంద్యాల(D) సంజామల 44.2°C, తిరుపతి(D) వరదయ్యపాలెంలో 43.8°C ఉష్ణోగ్రత నెలకొంది. 262 మండలాల్లో 40°Cలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదైనట్లు SDMA MD ప్రఖర్ జైన్ తెలిపారు. రేపు రాయలసీమ, కోస్తా జిల్లాల్లో 42-44°C మధ్య ఉష్ణోగ్రతలు ఉంటాయన్నారు. ఉత్తరాంధ్రలో తీవ్ర వడగాలులు వీచే అవకాశం ఉందని చెప్పారు. ఎండతీవ్రత దృష్ట్యా ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.



