News July 15, 2024
జేసీ, కేతిరెడ్డి కుటుంబ సభ్యులకు బెయిల్ మంజూరు

తాడిపత్రిలో ఎన్నికల సందర్భంగా జరిగిన అల్లర్ల కేసులో నిందితులకు ఏపీ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి, మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి కుటుంబ సభ్యులకు, మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి కుటుంబ సభ్యులకు బెయిల్ మంజూరు చేసింది. కాగా, ఇప్పటికే అల్లర్లపై నమోదైన కేసులలో అందరికీ బెయిల్ మంజూరైంది.
Similar News
News December 7, 2025
అనంతపురంలో రేపు ప్రజా వేదిక: కలెక్టర్

అనంతపురం కలెక్టరేట్లో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదికను నిర్వహిస్తామని కలెక్టర్ ఆనంద్ ఆదివారం తెలిపారు. కాల్ సెంటర్ 1100ను అందరికీ అందుబాటులో ఉంచామన్నారు. అర్జీలు పరిష్కారం కాకపోయినా, అర్జీల పరిస్థితిని తెలుసుకోవాలన్నా 1100కు కాల్ చేసి తెలుసుకోవచ్చన్నారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 1 వరకు నిర్వహిస్తామన్నారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.
News December 7, 2025
మత్తు పదార్థాలు ఆరోగ్యానికి హానికరం: ఎస్పీ

ఆరోగ్యవంతమైన సమాజానిర్మానానికి ప్రతిఒక్కరూ ముందుకు రావాలని SP జగదీశ్ పేర్కొన్నారు. ఆదివారం అనంతపురంలో ‘డ్రగ్స్ వద్దు బ్రో-సైకిల్ తొక్కు బ్రో’ అవగాహన సైకిల్ ర్యాలీ నిర్వహించారు. ఎస్పీ మాట్లాడుతూ.. డ్రగ్స్ యువత భవిష్యత్తును దెబ్బతీసే తీవ్రమైన సమస్య అన్నారు. ఈ ర్యాలీ వంటి కార్యక్రమాలు యువతలో అవగాహన పెంచడంతో పాటు ఆరోగ్యకరమైన అలవాట్లను ప్రోత్సహిస్తాయన్నారు. మత్తు పదార్థాలకు ఆరోగ్యానికి హానికరమన్నారు.
News December 7, 2025
దేశ రక్షణలో సైనికుల త్యాగాలు వెలకట్టలేనివి: కలెక్టర్

దేశ రక్షణలో సైనికులు, మాజీ సైనికుల త్యాగాల వెలకట్టలేని కలెక్టర్ ఆనంద్ పేర్కొన్నారు. ఆదివారం అనంతపురం కలెక్టర్ కార్యాలయంలో సాయుధ దళాల పతాక నిధికి తన వంతు విరాళాన్ని హుండీలో వేశారు. అనంతరం సాయుధ దళాల పథక దినోత్సవ వేడుకలను ప్రారంభించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో మాజీ సైనికులకు, అమరులైన సైనిక కుటుంబాలకు భూ పంపిణీ కోసం చర్యలు చేపట్టామన్నారు.


