News July 15, 2024
జేసీ, కేతిరెడ్డి కుటుంబ సభ్యులకు బెయిల్ మంజూరు
తాడిపత్రిలో ఎన్నికల సందర్భంగా జరిగిన అల్లర్ల కేసులో నిందితులకు ఏపీ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి, మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి కుటుంబ సభ్యులకు, మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి కుటుంబ సభ్యులకు బెయిల్ మంజూరు చేసింది. కాగా, ఇప్పటికే అల్లర్లపై నమోదైన కేసులలో అందరికీ బెయిల్ మంజూరైంది.
Similar News
News October 12, 2024
విద్యార్థులందరికీ విజయాలు చేకూరాలి: మాజీ రిజిస్ట్రార్
జేఎన్టీయూ విశ్వవిద్యాలయ పరిధిలోని విద్యార్థులకు జేఎన్టీయూ విశ్వవిద్యాలయ మాజీ రిజిస్ట్రార్ సీ.శశిధర్ విజయదశమి శుభాకంక్షాలు తెలిపారు. దుర్గామాత ఆశీస్సులతో విద్యార్థులందరికీ విజయాలు చేకూరాలని ఆయన అభిలషించారు. ప్రతి ఇంట సుఖ సంతోషాలు, శాంతి సౌభాగ్యాలు వెల్లివిరిసేలా జగన్మాత దీవెనలు లభించాలని ఆకాంక్షించారు.
News October 11, 2024
రాబోయే 3 రోజులలో భారీ వర్షాలు: కలెక్టర్
శ్రీ సత్యసాయి జిల్లాలో రాబోయే మూడు రోజులలో భారీ వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసిందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ టీఎస్ చేతను పేర్కొన్నారు. తుఫాన్ ప్రభావం వల్ల 14 నుంచి 16వ తేదీ వరకు రాయలసీమలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. ప్రజలు ముందు జాగ్రత్తలు పాటించాలని సూచించారు.
News October 11, 2024
కదిరి మున్సిపల్ ఛైర్ పర్సన్ రాజీనామా చేయాలి: కౌన్సిలర్ల డిమాండ్
కదిరి మున్సిపల్ ఛైర్ పర్సన్ నజీమున్నిసా రాజీనామా చేయాలని వైసీపీకి చెందిన పలువురు కౌన్సిలర్లు డిమాండ్ చేస్తున్నారు. నాలుగేళ్లుగా మున్సిపాలిటీ అభివృద్ధికి ప్రయత్నించలేదని, శాసనసభ ఎన్నికలలో వైసీపీ అభ్యర్థి గెలుపునకు కృషి చేయకపోగా.. ఓటమి కోసం పాటుపడ్డారని ఆరోపించారు. ఆరుగురు వైసీపీ కౌన్సిలర్లు టీడీపీలో చేరగా.. వారిని ఆపే ప్రయత్నం ఛైర్ పర్సన్ చేయలేదని అన్నారు.