News July 16, 2024

జేసీ పవన్‌కు కీలక నామినేటెడ్‌ పదవి?

image

అనంతపురం జిల్లా టీడీపీ నేత జేసీ పవన్‌కు కీలక నామినేటెడ్ పదవి వరించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. స్వతహాగా క్రీడలపట్ల మక్కువ చూపే పవన్‌ గతంలో ఆంధ్రప్రదేశ్ ఒలింపిక్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. ఈసారి ఏకంగా ఒలింపిక్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్ష పదవి ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రముఖ క్రీడాకారులతో పవన్‌కు పరిచయాలు ఉండటంతో కూటమి సర్కారు ఈ అవకాశం కల్పించనున్నట్లు ప్రచారం సాగుతోంది.

Similar News

News October 20, 2025

వైసీపీ మహిళా విభాగం జిల్లా ఉపాధ్యక్షురాలిగా రాధ

image

గుత్తి ఆర్ఎస్‌లోని ఎస్ఎస్ పల్లికి చెందిన చంద్రగిరి రాధను వైసీపీ మహిళా విభాగం అనంతపురం జిల్లా ఉపాధ్యక్షురాలిగా నియమించారు. ఈ మేరకు ఆదివారం పార్టీ కేంద్ర కార్యాలయం ఉత్తర్వులు జారీ చేసింది. రాధ ఎంపిక పట్ల వైసీపీ నాయకులు, కార్యకర్తలు హర్షం వ్యక్తం చేశారు. పార్టీ బలోపేతం కోసం శక్తివంచన లేకుండా కృషి చేస్తానని రాధ అన్నారు.

News October 19, 2025

పిల్లల పట్ల తల్లిదండ్రులు జాగ్రత్త వహించండి: ఎస్పీ

image

అనంతపురం జిల్లా ప్రజలకు, జిల్లా పోలీసు సిబ్బందికి ఎస్పీ జగదీశ్ దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. ఈ దీపావళి మీ జీవితాలలో చీకట్లను పారదోలి మరిన్ని కాంతులు నింపాలని ఆకాంక్షించారు. చెడుపై మంచి సాధించిన విజయానికి సంకేతంగా జరుపుకునే ఈ దీపావళి పర్వదినాన ఆనవాయితీగా వచ్చే బాణసంచాను సరైన జాగ్రత్తలతో కాల్చాలని సూచించారు. పిల్లల పట్ల తల్లిదండ్రులు మరింత అప్రమత్తంగా ఉండాలని కోరారు.

News October 19, 2025

రేపు ప్రజా సమస్యల పరిష్కార వేదిక రద్దు: కలెక్టర్

image

అనంతపురం కలెక్టరేట్‌లో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదికను రద్దు చేసినట్లు కలెక్టర్ ఆనంద్ ఆదివారం ప్రకటించారు. సోమవారం దీపావళి సందర్భంగా ప్రభుత్వ సెలవు ఉన్నందున ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించడం లేదని తెలిపారు. ప్రజలు ఈ విషయాన్ని గమనించాలని విజ్ఞప్తి చేశారు.