News March 13, 2025
జైనథ్: నలుగురు యువకులపై కేసు : SI

బెదిరింపులకు గురిచేసిన యువకులపై కేసు నమోదు చేసినట్లు జైనథ్ ఎస్‌ఐ పురుషోత్తం తెలిపారు. ఎస్ఐ వివరాల ప్రకారం.. ADBకు చెందిన రాకేశ్, సచిన్, కార్తీక్, సాత్వీక్‌లు ఎలాంటి అధికారం లేకుండా మంగళవారం అర్ధరాత్రి భోరజ్ చెక్‌పోస్టు వద్ద హైవేపై ఎద్దుల లారీలను అక్రమంగా అడ్డుకున్నారు. లారీ డ్రైవర్లు సందీప్ గోకులే, సాహిల్‌లను బెదిరిస్తూ, భయభ్రాంతులకు గురి చేశారన్నారు. వీరిపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు.
Similar News
News March 27, 2025
ADB: శిక్షణ, ఉపాధి కోసం దరఖాస్తుల ఆహ్వానం

అదిలాబాద్ జిల్లాలోని ఎస్సీ, మైనార్టీ యువకులకు టెలి హెల్త్ సర్వీస్ కోఆర్డినేటర్, ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్ కోర్సులకు దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు డీఆర్డీఓ రవీందర్ రాథోడ్ తెలిపారు. హైదరాబాద్‌లో ఉచిత భోజన వసతులతో పాటు ఉపాధి కల్పించనున్నట్లు పేర్కొన్నారు. 30 సంవత్సరాల లోపు వయస్సు ఉండి ఆసక్తి గలవారు ఈ నెల 28న అన్ని ధ్రువీకరణ పత్రాలు, పాస్ ఫోటోలతో ఆదిలాబాద్ టీటీడీసీలో హాజరు కావాలని సూచించారు.
News March 27, 2025
ADB: జాతీయస్థాయి టోర్నీకి రితీక

బిహార్‌లో నేటి నుంచి 30 తేదీ వరకు జాతీయస్థాయి సబ్ జూనియర్ కబడ్డీ టోర్నీ నిర్వహించనున్నారు. ఈ పోటీలకు తెలంగాణ బాలికల జట్టుకు ఆదిలాబాద్ జిల్లా క్రీడాకారిణి జాబడే రితీక ఎంపికయ్యారు. జాతీయస్థాయి టోర్నీకి రితీక ఎంపికపై జిల్లా కబడ్డీ అసోసియేషన్ చీఫ్ గోడం నగేశ్, ఛైర్మన్ పాయల్ శంకర్, అధ్యక్షుడు రఘుపతి, ప్రధాన కార్యదర్శి రాష్ట్రపాల్ హర్షం వ్యక్తం చేశారు.
News March 27, 2025
ADB: ‘రాముల వారి తలంబ్రాలు కోసం సంప్రదించండి’

భద్రాచలం శ్రీరాముల వారి కళ్యాణ తలంబ్రాలను RTC కార్గో ద్వారా భక్తుల ఇంటి వద్దకు తీసుకొచ్చి ఇవ్వనున్నట్లు రీజినల్ మేనేజర్ సోలోమాన్ తెలిపారు. గురువారం ఆదిలాబాద్‌లోని ఆర్ఎం కార్యాలయంలో రాములవారి తలంబ్రాల పోస్టర్లను ఆవిష్కరించారు. భక్తులు కార్గో కౌంటర్లలో రూ.151 చెల్లించి బుక్ చేసుకోవాలని సూచించారు. ఇప్పటివరకు రీజియన్ పరిధిలో దాదాపు 1000 మంది భక్తులు తలంబ్రాల కోసం బుక్ చేసుకున్నట్లు వెల్లడించారు.