News February 8, 2025

జైనూర్: విద్యార్థులతో అడిషనల్ కలెక్టర్ భోజనం

image

మండలంలోని పాట్నాపూర్ గ్రామంలో గల ఆశ్రమ బాలికల పాఠశాలను అడిషనల్ కలెక్టర్ దీపక్ తివారి శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. తరగతి గదులు, వంటశాల, తాగునీరు, మౌలిక సదుపాయాలను పరిశీలించారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. ఈ క్రమంలో విద్యార్థుల ఆరోగ్యం దృశ్య డైట్ ఛార్జీలను పెంచి నూతన మెనూ అమలు చేస్తుందన్నారు. అనంతరం విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. 

Similar News

News December 24, 2025

విశాఖ 10 జోన్‌లకు కమిషనర్ల నియామకం

image

జీవీఎంసీ పరిధిలో పది జోన్లు ఏర్పాటు కావడంతో జోనల్ కమిషనర్లను నియమిస్తూ కమిషనర్ కేతన్ గార్గ్ ఉత్తర్వులు జారీ చేశారు. జోన్-1 నాగేంద్ర కుమార్. జోన్-2 నాయుడు, జోన్-3 శివప్రసాద్. జోన్-4 మల్లయ్య నాయుడు, జోన్-5 రాము, జోన్-6 హైమావతి, జోన్-7 శంకర్రావు, జోన్-8 తిరుపతి, జోన్-9 శేషాద్రి, జోన్-10 చక్రవర్తిలను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

News December 24, 2025

విశాఖలో పోలీస్ అధికారిపై కేసు నమోదు

image

గాజువాక ట్రాఫిక్ స్టేషన్లో ఏఎస్ఐగా పని చేస్తున్న ఎంఎస్ఎన్ రాజు తమకు అధిక వడ్డీ ఆశ చూపి డబ్బులు తీసుకుని మోసం చేశారని ఐదుగురు కానిస్టేబుల్స్ గాజువాక స్టేషన్లో ఫిర్యాదు చేశారు. తోటి ఉద్యోగుల నుంచి పలు దఫాలుగా 16 లక్షల వరకు అధిక వడ్డీలు ఇస్తానని నమ్మించి మోసం చేశారని సీఐ పార్థసారధికి ఫిర్యాదు చేశారు. నిన్న రాత్రి ఏఎస్సై కేసు నమోదు చేశారు. ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు

News December 24, 2025

400 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

image

బ్యాంక్ ఆఫ్ ఇండియా 400 గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హతగల వారు రేపటి నుంచి జనవరి 10 వరకు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థుల వయసు 20 నుంచి 28ఏళ్ల మధ్య ఉండాలి. ముందుగా NATS పోర్టల్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఎంపికైన అప్రెంటిస్‌లకు నెలకు రూ.13,000 చెల్లిస్తారు. వెబ్‌సైట్: https://bankofindia.bank.in/