News February 8, 2025
జైనూర్: విద్యార్థులతో అడిషనల్ కలెక్టర్ భోజనం

మండలంలోని పాట్నాపూర్ గ్రామంలో గల ఆశ్రమ బాలికల పాఠశాలను అడిషనల్ కలెక్టర్ దీపక్ తివారి శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. తరగతి గదులు, వంటశాల, తాగునీరు, మౌలిక సదుపాయాలను పరిశీలించారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. ఈ క్రమంలో విద్యార్థుల ఆరోగ్యం దృశ్య డైట్ ఛార్జీలను పెంచి నూతన మెనూ అమలు చేస్తుందన్నారు. అనంతరం విద్యార్థులతో కలిసి భోజనం చేశారు.
Similar News
News February 12, 2026
సిరిసిల్ల: కౌంటింగ్ అధికారులు, సిబ్బంది ర్యాండమైజేషన్ పూర్తి

మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ఇంచార్జి కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి గరిమ అగ్రవాల్ నేతృత్వంలో సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో కౌంటింగ్ అధికారులు, సిబ్బంది ర్యాండమైజెషన్ ప్రక్రియ గురువారం పూర్తి చేశారు. జిల్లా మున్సిపల్ ఎన్నికల సాధారణ పరిశీలకులు డాక్టర్ శ్రీనివాస్ రెడ్డితో కలిసి ప్రక్రియను ఆమె పూర్తి చేశారు. కార్యక్రమంలో డీఈఓ జగన్ మోహన్ రెడ్డి తదితరులు ఉన్నారు.
News February 12, 2026
GNT: చంద్రబాబును కలిసిన బండ్ల గణేశ్

సీఎం చంద్రబాబును సినీ నిర్మాత బండ్ల గణేశ్ గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. ముఖ్యమంత్రి క్షేమం, రాష్ట్ర అభివృద్ధి కోసం తిరుమలకు పాదయాత్రగా వెళ్లి మొక్కు తీర్చుకున్నట్లు తెలిపారు. పాదయాత్ర అనుభవాలను సీఎం అడిగి తెలుసుకొని అభినందించారు. ఈ సందర్భంగా స్వామివారి ప్రసాదాన్ని ఆయన సీఎంకి అందించారు. .
News February 12, 2026
KMR: అభ్యర్థుల్లో ఉత్కంఠ.. గెలుపెవరిదో!

కామారెడ్డి జిల్లాలో జరిగిన ఆయా మున్సిపల్ ఎన్నికల అంకం తుది దశకు చేరుకుంది. బరిలో నిలిచిన అభ్యర్థుల్లో ఫలితాలపై ఎవరి ధీమాలో వారున్నారు. జిల్లాలో 447 మంది అభ్యర్థులు పోటీ చేసినప్పటికీ ప్రధాన పార్టీలు 309 మంది ఎత్తుకు పై ఎత్తులు వేసి పోటీలో నిలబడ్డారు. ప్రధానంగా కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ మధ్యే పోటీ నెలకొంది. ఓటర్ల నాడి రేపు తెలతెల్లం కానున్నాయి. దీంతో అభ్యర్థుల్లో గెలుపు అవకాశాలపై ఉత్కంఠ నెలకొంది.


