News March 4, 2025
జైపూర్లో ఇంటర్ విద్యార్థిని సూసైడ్

ఇంటర్ విద్యార్థిని సూసైడ్ చేసుకున్న ఘటన జైపూర్ మండలం శెట్పల్లిలో జరిగింది. SI శ్రీధర్ వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన హాసిని చెన్నూర్ కేజీబీవీలో ఇంటర్ చదివి ఇష్టం లేక ఇంటికి వచ్చింది. ఆమెకు తండ్రి సర్దిచెప్పి తిరిగి మంచిర్యాలలోని ఓ ప్రైవేట్ కళాశాలలో చేర్పించగా 2 నెలలు కాలేజీకి వెళ్లింది. ఆ తర్వాత ఇంటి వద్దే ఉంటూ పరీక్షలకు సన్నద్ధమవుతుంది. పరీక్షల్లో ఫేయిల్ అవుతాననే భయంతో ఆదివారం ఉరేసుకుంది.
Similar News
News September 16, 2025
ADB: కాంగ్రెస్ గూటికి మాజీ నేతలు

TPCC అధ్యక్షుడు బొమ్మ మహేశ్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో జిల్లాకు చెందిన పలువురు మాజీ నేతలు తిరిగి కాంగ్రెస్ గూటికి చేరుకున్నారు. ఇందులో మాజీ TPCC ప్రధాన కార్యదర్శి గండ్రత్ సుజాత, మాజీ డీసీసీ అధ్యక్షుడు సాజీద్ ఖాన్, మాజీ మార్కెట్ కమిటీ ఛైర్మన్ అల్లూరి సంజీవరెడ్డి ఉన్నారు. ఈ సందర్భంగా వారు పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్, సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటి సీఎం భట్టి విక్రమార్కకు ధన్యవాదాలు తెలిపారు.
News September 16, 2025
ADB: మొదలై వెంటనే ముగిసిన ఓ తల్లి విషాద గాథ..!

సిరికొండ మండలం బీంపూర్కు చెందిన తోడసం ఏత్మ భాయి(20) ప్రసవం తర్వాత మృతి చెందడం విషాదాన్ని నింపింది. ఈనెల 12న పురిటి నొప్పులతో ఆమెను ఇంద్రవెల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, బాలుడికి జన్మనిచ్చింది. 14వ తేదీన డిశ్చార్జ్ అయ్యాక తీవ్రమైన తలనొప్పి రావడంతో 108లో రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మంగళవారం సాయంత్రం మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు.
News September 16, 2025
ADB: OPEN స్కూల్ అడ్మిషన్లకు గడువు పొడిగింపు

టెన్త్, ఇంటర్మీడియట్ ఓపెన్ స్కూల్ అడ్మిషన్ల కోసం గడువును పొడగించినట్లు జిల్లా విద్యాధికారి (డీఈఓ) ఖుష్బూ గుప్తా తెలిపారు. ఎలాంటి అపరాధ రుసుము లేకుండా ఈనెల 12వ తేదీ వరకు అవకాశం ఉండగా 18 వరకు పొడగించినట్లు పేర్కొన్నారు. అపరాధ రుసుంతో సెప్టెంబర్ 20వ తేదీ వరకు గడువు ఉందని వెల్లడించారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని విద్యార్థులకు సూచించారు.