News March 4, 2025
జైపూర్‌లో ఇంటర్ విద్యార్థిని సూసైడ్

ఇంటర్ విద్యార్థిని సూసైడ్ చేసుకున్న ఘటన జైపూర్ మండలం శెట్పల్లిలో జరిగింది. SI శ్రీధర్ వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన హాసిని చెన్నూర్ కేజీబీవీలో ఇంటర్ చదివి ఇష్టం లేక ఇంటికి వచ్చింది. ఆమెకు తండ్రి సర్దిచెప్పి తిరిగి మంచిర్యాలలోని ఓ ప్రైవేట్ కళాశాలలో చేర్పించగా 2 నెలలు కాలేజీకి వెళ్లింది. ఆ తర్వాత ఇంటి వద్దే ఉంటూ పరీక్షలకు సన్నద్ధమవుతుంది. పరీక్షల్లో ఫేయిల్ అవుతాననే భయంతో ఆదివారం ఉరేసుకుంది.
Similar News
News October 21, 2025
బొబ్బిలిలో మానవత్వం మంట కలిసింది..

స్పృహతప్పి పడిపోయిన మహిళను ఆసుపత్రికి తరలించాల్సిన జనం పూర్తిగా పట్టించుకోలేదు. బొబ్బిలి మున్సిపాలిటీలోని గొల్లపల్లి ఆటో స్టాండ్‌లో ఓ మహిళ స్పృహతప్పి పడిపోయింది. ఆమె రక్తపు మడుగుల్లో ఉన్నప్పటికీ ఎవరూ పట్టించుకోలేదు. అటువైపు వెళ్తున్న ఎస్ఐ రమేశ్, సిబ్బంది చూసి సపర్యలు చేసి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు చెప్పారు. మృతురాలి వివరాలు తెలియాల్సి ఉంది.
News October 21, 2025
ఆక్వా రైతులకు శుభవార్త చెప్పిన లోకేశ్

AP: ఆక్వా రైతులకు మంత్రి నారా లోకేశ్ శుభవార్త చెప్పారు. ఇప్పటివరకు తెల్లమచ్చ వైరస్ కారణంగా పొట్టు తీయని రొయ్యల ఎగుమతులపై ఆస్ట్రేలియా పరిమితులు విధించగా తాజాగా వాటిని ఎత్తివేసి ఎగుమతులకు అనుమతించిందని మంత్రి చెప్పారు. దీనికోసం కృషిచేసిన ఇండియా, ఆస్ట్రేలియా ప్రభుత్వాలకు కృతజ్ఞతలు తెలిపారు. ఇబ్బందుల నుంచి గట్టెక్కేందుకు కొత్త మార్కెట్లకు విస్తరించాల్సిన అవసరముందని ఇది నిరూపిస్తోందని వివరించారు.
News October 21, 2025
పోలీస్ అమరుల ఆశయాలను నెరవేర్చాలి: KMR SP

పోలీసు అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయమైనవని కామారెడ్డి ఎస్పీ రాజేష్ చంద్ర తెలిపారు. జిల్లా పోలీసు కార్యాలయంలో అమరవీరుల స్తూపం వద్ద SP నివాళులర్పించి, శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. అమరుల ఆశయాలను నెరవేర్చడం, వారి కుటుంబాల సంక్షేమం కోసం కృషి చేయడమే మనం వారికి అందించే నిజమైన నివాళి అని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ నరసింహ రెడ్డి, చైతన్య రెడ్డి పాల్గొన్నారు.