News March 4, 2025

జైపూర్‌లో ఇంటర్ విద్యార్థిని సూసైడ్

image

ఇంటర్ విద్యార్థిని సూసైడ్ చేసుకున్న ఘటన జైపూర్ మండలం శెట్పల్లిలో జరిగింది. SI శ్రీధర్ వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన హాసిని చెన్నూర్ కేజీబీవీలో ఇంటర్ చదివి ఇష్టం లేక ఇంటికి వచ్చింది. ఆమెకు తండ్రి సర్దిచెప్పి తిరిగి మంచిర్యాలలోని ఓ ప్రైవేట్ కళాశాలలో చేర్పించగా 2 నెలలు కాలేజీకి వెళ్లింది. ఆ తర్వాత ఇంటి వద్దే ఉంటూ పరీక్షలకు సన్నద్ధమవుతుంది. పరీక్షల్లో ఫేయిల్ అవుతాననే భయంతో ఆదివారం ఉరేసుకుంది.

Similar News

News March 11, 2026

పాలమూరు: భానుడి ప్రతాపం.. అడుగంటుతోన్న భూగర్భ జలాలు!

image

ఉమ్మడి పాలమూరులో వేసవి ఆరంభంలోనే ఎండలు నిప్పులు చెరుగుతున్నాయి. రోజురోజుకూ పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో భూగర్భ జలమట్టం వేగంగా పడిపోతోంది. మార్చి నెలలోనే పరిస్థితి ఇలా ఉంటే, ఏప్రిల్, మే నెలల్లో పరిస్థితి మరింత దారుణంగా ఉంటుందని రైతాంగం తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తోంది. వేసవి ప్రారంభంలోనే జలవనరులు అడుగంటడం వల్ల పెట్టిన పెట్టుబడి కూడా దక్కేలా లేదని, నీరు అందక పంటలు ఎండిపోతున్నాయని రైతులు వాపోతున్నారు.

News March 11, 2026

సంచలన తీర్పు.. కారుణ్య మరణానికి సుప్రీం అనుమతి

image

సుప్రీంకోర్టు చరిత్రాత్మక తీర్పునిస్తూ 32 ఏళ్ల హరీశ్ రాణాకు కారుణ్య మరణం (Passive Euthanasia) కింద వైద్య సహాయాన్ని నిలిపివేసేందుకు అనుమతించింది. దేశంలో ఇటువంటి కేసు ఇదే మొదటిది కావడం గమనార్హం. 100% వైకల్యంతో రాణా 12 ఏళ్లుగా కోమాలో ఉన్నారు. ఆయనకు లైఫ్ సపోర్ట్ తొలగించాలని ధర్మాసనం సూచించింది. కోలుకునే అవకాశం లేనప్పుడు గౌరవప్రదంగా మరణించే హక్కు వ్యక్తికి ఉంటుందని కోర్టు వ్యాఖ్యానించింది.

News March 11, 2026

ఏలూరు జిల్లాలో కావూరి ప్రస్థానం ఇదే..!

image

ఏలూరు మాజీ ఎంపీ కావూరి సాంబశివరావు మృతి పట్ల పలువురు నాయకుడు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. నాయకులు తెలిపిన వివరాలు ప్రకారం.. 1984,1989లో కృష్ణా జిల్లాలోని మచిలీపట్నం ఎంపీగా పనిచేశారు. 2004, 2009లో ఏలూరు ఎంపీగా పనిచేశారు. 2013లో కేంద్ర క్యాబినెట్ మంత్రిగా పనిచేశారు. ఏలూరు జిల్లాలోని గ్రామాలలో సైతం పర్యటించి వారి సమస్యలను పూర్తిస్థాయిలో పరిష్కరించి, అభివృద్ధి బాటలో నడిపించిన వ్యక్తి అని కొనియాడారు.