News August 10, 2024

జైపూర్: అవయవదానంతో ఏడుగురికి ప్రాణదానం

image

జైపూర్ మండలంలోని షెట్పల్లి గ్రామానికి చెందిన రేవెల్లి శ్రీకాంత్ అనే యువకుడు తాను మరణిస్తూ ఏడుగురి వ్యక్తుల జీవితాల్లో వెలుగు నింపాడు. ఈ నెల 6న జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన శ్రీకాంత్ హైదరాబాద్‌లో చికిత్స పొందుతూ శనివారం బ్రెయిన్ డెడ్ అయ్యాడు. దీంతో కుటుంబ సభ్యులు శ్రీకాంత్ రెండు కిడ్నీలు, లివర్, గుండె, రెండు కళ్లు, ఊపిరితిత్తులు దానం చేశారు. శ్రీకాంత్‌కు భార్య స్వప్న, కుమారుడు ఉన్నారు.

Similar News

News October 20, 2025

దండారి ఉత్సవాల్లో పాల్గొన్న ఆదిలాబాద్ ఎంపీ

image

గిరిజనుల దండారి ఉత్సవాల్లో ఆదిలాబాద్ పార్లమెంట్ సభ్యుడు గోడం నగేష్ పాల్గొన్నారు. ఆదిలాబాద్‌లోని కొమరం భీమ్ కాలనీలో సోమవారం వేడుకలు నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. గిరిజనుల సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించే కార్యక్రమమే దండారి ఉత్సవాలు అన్నారు. ఈ కార్యక్రమంలో తాటి పెళ్లి రాజు, కనపర్తి చంద్రకాంత్, తదితరులు పాల్గొన్నారు.

News October 20, 2025

పోలీసు అమరవీరుల వారోత్సవాల షెడ్యూల్ ఇదే

image

జిల్లాలో అమరులైన పోలీసుల జ్ఞాపకార్థం నిర్వహించే ఫ్లాగ్ డే (పోలీసు అమరవీరుల దినోత్సవం) వారోత్సవాలను ఈ నెల 21 నుంచి 24 వరకు ఘనంగా నిర్వహించాలని ఆదిలాబాద్ ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. 21న హెడ్ క్వార్టర్స్‌లో అమరవీరుల స్తూపం వద్ద కలెక్టర్, ఎస్పీ నివాళులర్పిస్తారు. 22న మెగా రక్తదానం, 23న ఓపెన్ హౌస్, సైకిల్ ర్యాలీ, 24న 2000 మంది విద్యార్థులతో 5కే రన్ ఉంటుంది.

News October 20, 2025

ADB: ​బీసీ విద్యార్థులకు శుభవార్త..!

image

బీసీ విద్యార్థుల ఉన్నత భవిష్యత్తు కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న మహాత్మా జ్యోతిబా ఫూలే విదేశీ విద్యానిధి పథకం దరఖాస్తు గడువు ఈ నెల 31 వరకు పొడిగించారు. విద్యార్థుల సౌలభ్యం దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు బీసీ సంక్షేమశాఖ అధికారులు తెలిపారు. అర్హులు సద్వినియోగం చేసుకుని ఉన్నత విద్యను అభ్యసించాలని కోరారు. గత గడువు 15తో ముగియగా.. పొడిగించినట్లు పేర్కొన్నారు.