News August 10, 2024
జైపూర్: అవయవదానంతో ఏడుగురికి ప్రాణదానం
జైపూర్ మండలంలోని షెట్పల్లి గ్రామానికి చెందిన రేవెల్లి శ్రీకాంత్ అనే యువకుడు తాను మరణిస్తూ ఏడుగురి వ్యక్తుల జీవితాల్లో వెలుగు నింపాడు. ఈ నెల 6న జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన శ్రీకాంత్ హైదరాబాద్‌లో చికిత్స పొందుతూ శనివారం బ్రెయిన్ డెడ్ అయ్యాడు. దీంతో కుటుంబ సభ్యులు శ్రీకాంత్ రెండు కిడ్నీలు, లివర్, గుండె, రెండు కళ్లు, ఊపిరితిత్తులు దానం చేశారు. శ్రీకాంత్‌కు భార్య స్వప్న, కుమారుడు ఉన్నారు.
Similar News
News September 15, 2024
మంచిర్యాల: బంగారు నగల బ్యాగును అప్పగించిన పోలీసులు
బస్సులో పోగొట్టుకున్న బంగారు నగలతో కూడిన బ్యాగును కనుక్కొని బాధితురాలికి మంచిర్యాల పోలీసులు అందజేశారు. సీఐ బన్సీలాల్ వివరాలు.. జగిత్యాల నుంచి ఇందారంలోని బంధువుల ఇంటికి వెళ్లడానికి మంచిర్యాలకు వచ్చిన సానియా అనే మహిళ బస్సు దిగే సమయంలో బ్యాగ్ మర్చిపోయింది. దీంతో పోలీసులను సంప్రదించగా వెంటనే బ్లూ కోల్డ్ సిబ్బంది సీసీ కెమెరాలను పరీక్షించి రైల్వే స్టేషన్‌లో బ్యాగును గుర్తించి బాధితురాలికి అందజేశారు.
News September 14, 2024
BREAKING: మంచిర్యాల జిల్లాలో విషాదం
మంచిర్యాల జిల్లాలో ఈరోజు విషాదం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు.. కాసిపేట మండలం దేవాపూర్‌లో ఇద్దరు యువకులను ఓ పాము కాటేసింది. గ్రామస్థులు గమనించగా వారిని ఆస్పత్రికి తరలించారు. కాగా, అప్పటికే యువకుడు నవీన్ మృతి చెందగా మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
News September 14, 2024
కడెం ప్రాజెక్టు ప్రస్తుత నీటి వివరాలు
కడెం ప్రాజెక్టు ప్రస్తుత నీటి వివరాలను అధికారులు శనివారం ఉదయం వెల్లడించారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి సామర్థ్యం 700 అడుగులు కాగా, ప్రస్తుతం 699.950 అడుగుల నీటిమట్టం నిల్వ ఉందన్నారు. ఎగువ ప్రాంతాల నుంచి ప్రాజెక్టులోకి 966 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతోందన్నారు. ప్రాజెక్టు లెఫ్ట్, రైటు కెనాల్‌ల ద్వారా 870, మిషన్ భగీరథకు 9 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నట్లు తెలిపారు.