News July 12, 2024
జైపూర్: ఉరివేసుకొని డిగ్రీ విద్యార్థిని ఆత్మహత్య

జైపూర్ మండలం మిట్టపల్లిలోని కొమ్ముగూడెనికి చెందిన డిగ్రీ విద్యార్థిని సెగ్యం భాగ్యలక్ష్మి (18) గ్రామ సమీపంలోని మామిడి తోటలో గురువారం రాత్రి చెట్టుకు ఉరివేసుకొని బలవన్మరణానికి పాల్పడింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం సెగ్యం రమేశ్-శ్రీలత దంపతుల కూతురుభాగ్యలక్ష్మి జిల్లా కేంద్రంలో డిగ్రీ చదువుతుంది. సంఘటన స్థలానికి చేరుకున్న ఎస్ఐ శ్రీధర్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Similar News
News September 18, 2025
ఆదిలాబాద్: ‘మిత్తి’మీరుతున్నారు..!

అమాయక ప్రజల అవసరాలను ఆసరాగా చేసుకుంటున్న కొంతమంది వడ్డీ వ్యాపారులు అడ్డగోలు దందాలకు పాల్పడుతున్నారు. సామాన్యులే లక్ష్యంగా.. రుణాలు ఇచ్చేటప్పుడు ఒక రేటు మాట్లాడి తిరిగి తీసుకునేటప్పుడు అధిక వడ్డీలు వసూలు చేస్తూ వేధిస్తున్నారు. ఈ వేధింపులకు బలవుతున్న వారిలో తాజాగా ఇంద్రవెల్లిలో ఒకరు ఆత్మహత్య చేసుకున్నారు. గతంలో జిల్లా అంతటా పోలీసులు దాడులు చేసి సుమారు 30 మందిపై కేసులు నమోదు చేసినా, తీరు మారడం లేదు.
News September 18, 2025
పాఠశాలలోని సమస్యలను పరిష్కరించాలి: కలెక్టర్

ప్రభుత్వ పాటశాలలో నెలకొన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని కలెక్టర్ రాజర్షి షా అన్నారు. బుధవారం కలెక్టరేట్లో విద్యాశాఖ అధికారులు, సంబంధిత అధికారులతో మండలాల వారిగా, పాఠశాల సముదాయాల వారీగా సమీక్ష సమావేశం నిర్వహించారు. పాఠశాలల వారీగా ఆగస్టు నెల సగటు విద్యార్థుల హాజరు నివేదికలు, టాప్ 5 పాఠశాలలు, అట్టడుగు 5 పాఠశాలలు, పాఠశాల కాంప్లెక్స్ వారీగా సమస్యలు అడిగి తెలుసుకుని సూచనలు చేశారు.
News September 18, 2025
ADB: క్రైస్తవ సంఘాలతో ఛైర్మన్ సమావేశం

రాష్ట్ర క్రైస్తవ మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఛైర్మన్ దీపక్ జాన్ ఆదిలాబాద్లో బుధవారం పర్యటించారు. కలెక్టర్ రాజర్షిషాతో కలిసి క్రైస్తవ సంఘాలు, పాస్టర్లతో సమీక్షా సమావేశం నిర్వహించి వారి సమస్యలను తెలుసుకున్నారు. క్రైస్తవ శ్మశానవాటికకు భూమి, బీసీ-సీ కుల ధ్రువీకరణ పత్రం, క్రైస్తవ కమ్యూనిటీ హాల్ వంటి వారి సమస్యలను ఆయనకు వివరించారు. సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఛైర్మన్ హామీ ఇచ్చారు.