News January 27, 2025

జైపూర్: సింగరేణి సంస్థ విస్తరణకు అడుగులు: సీఎండీ

image

సింగరేణి సంస్థను బహుముఖ విస్తరణకు ప్రణాళికాబద్ధంగా అడుగులు వేస్తున్నట్లు సీఎండీ ఎన్.బలరామ్ తెలిపారు. సింగరేణి కార్పొరేట్ ఆధ్వర్యంలో జరిగిన గణతంత్ర వేడుకల్లో  ఆయన మాట్లాడారు. జైపూర్‌లోని థర్మల్ పవర్ ప్లాంట్ ఆవరణలో 800 మెగావాట్ల సూపర్ క్రిటికల్ థర్మల్ పవర్ ప్లాంట్ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. వినియోగదారులకు నాణ్యమైన బొగ్గు అందించడంలో ప్రతీ ఉద్యోగి కీలక పాత్ర పోషించాలని కోరారు.

Similar News

News February 10, 2025

వన్డేల్లో అత్యధిక సెంచరీలు వీరివే

image

వన్డే క్రికెట్ చరిత్రలో అత్యధిక సెంచరీలు చేసిన బ్యాటర్ల జాబితాలో విరాట్ కోహ్లీ(50) తొలి స్థానంలో కొనసాగుతున్నారు. రెండో స్థానంలో సచిన్ టెండూల్కర్ (49), మూడో స్థానంలో రోహిత్ శర్మ (32) ఉన్నారు. తర్వాతి స్థానాల్లో వరుసగా రికీ పాంటింగ్ (30), జయసూర్య (28), ఆమ్లా (27), ఏబీ డివిలియర్స్ (25), క్రిస్ గేల్ (25), కుమార సంగక్కర (25) కొనసాగుతున్నారు. టాప్-3లో ముగ్గురూ భారతీయులే ఉండటం విశేషం.

News February 10, 2025

కాగజ్నగర్: మినీ మేడారం జాతరకు ఏర్పాట్లు పూర్తి

image

కాగజ్నగర్ సమీపంలోని పెద్దవాగు వద్ద మినీ మేడారం (సమ్మక్క, సారలమ్మ) జాతరకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఆలయ కమిటీ అధ్యక్షుడు తుమ్మ రమేష్ తెలిపారు. ఈనెల 12 నుంచి 15 వరకు జాతరను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సౌకర్యాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. శ్రీనివాస్, రాజయ్య, పిరిసింగుల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

News February 10, 2025

బెల్లంపల్లి: బార్ దాడి ఘటనలో ముగ్గురి రిమాండ్

image

బెల్లంపల్లి SRR బార్‌లో తాండూర్‌కు చెందిన బండారి వంశీ అనే వ్యక్తిపై బీరు సీసాలతో దాడి చేసిన ముగ్గురు నిందితులను రిమాండ్ నిమిత్తం కోర్టులో హాజరు పరిచినట్లు రూరల్ CI అబ్సలుద్దీన్ తెలిపారు. ఆయన మాట్లాడుతూ..2 టౌన్ పోలీస్ స్టేషన్‌లో నమోదైన కేసులో అల్లి సాగర్, రత్నం సోమయ్య, మామిడి అన్నమయ్యలను ఆదివారం అరెస్టు చేసి రిమాండ్ నిమిత్తం కోర్టులో హాజరు పరిచినట్లు CIవివరించారు.

error: Content is protected !!