News March 12, 2025

జైపూర్: 40 నెలల్లో పవర్ ప్లాంట్ పూర్తి: సింగరేణి సీఎండీ

image

జైపూర్‌లోని 1200మెగావాట్ల సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రం ఆవరణలో నూతనంగా 800 మెగావాట్ల అల్ట్రా సూపర్ క్రిటికల్ థర్మల్ పవర్ ప్లాంట్ నిర్మాణానికి సంబంధించి బీహెచ్ఈఎల్ సంస్థతో సింగరేణి ఒప్పందం కుదుర్చుకుంది. ఈ సందర్భంగా సింగరేణి సీఎండీ ఎన్.బలరామ్ మాట్లాడారు. ఒప్పందం ప్రకారం గరిష్టంగా 4ఏళ్లలో ప్లాంట్ నిర్మాణం పూర్తవ్వాలని పేర్కొన్నారు. కానీ 40 నెలల్లోనే పూర్తిచేయాలనే లక్ష్యం పెట్టుకున్నట్లు తెలిపారు.

Similar News

News October 29, 2025

మరింత కష్టపడి మీ నోరు మూయిస్తా: అభిషేక్

image

అవార్డు కొనుక్కున్నానంటూ వచ్చిన కామెంట్లపై నటుడు అభిషేక్ బచ్చన్ తనదైన శైలిలో స్పందించారు. ‘అవార్డుకోసం పీఆర్‌ మేనేజ్ చేయలేదు. కష్టంతో కన్నీళ్లు ఒలికించి, రక్తం చిందించి సాధించాను. మీరు ఇకపైనా నమ్ముతారనుకోను. అందుకే మరో విజయం కోసం మరింత కష్టపడి మీ నోరు మూయిస్తా’ అని Xలో ఆయన పేర్కొన్నారు. కాగా ‘ఐ వాంట్ టు టాక్’ మూవీలో ఆయన నటనకు ఫిలింఫేర్-2025 అవార్డు దక్కగా దాన్ని కొన్నారని SMలో విమర్శలొచ్చాయి.

News October 29, 2025

రాబోయే 4 రోజులు కీలకం: మంత్రి సత్యకుమార్

image

మొంథా తుఫాన్ దృష్ట్యా రాబోయే నాలుగు రోజులు చాలా కీలకమని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మంత్రి సత్యకుమార్ సూచించారు. సీఎం చంద్రబాబు ఆర్టీజీఎస్‌లో సమీక్షిస్తూ, అధికారులకు తగిన ఆదేశాలిచ్చారన్నారు. రాష్ట్రంలోని 2,555 మంది గర్భిణులను ఆసుపత్రులకు తరలించి వైద్యం అందించడం ద్వారా పెద్ద విపత్తు నుంచి రాష్ట్రాన్ని కాపాడారని ఆయన తెలిపారు.

News October 29, 2025

వర్షాల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలి: కమిషనర్

image

తుఫాన్ ఎఫెక్ట్ నేపథ్యంలో భారీ వర్షాల దృష్ట్యా కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి పరిస్థితులను గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కమిషనర్ చాహత్ బాజ్ పాయ్ పరిశీలించారు. ఇంజినీరింగ్, శానిటేషన్ శాఖల అధికారులు, సిబ్బందికి కమిషనర్ పలు సూచనలు చేశారు. వర్షాల నేపథ్యంలో ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలన్నారు.